కమల్ హాసన్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సూపర్ సక్సెస్ విక్రం సినిమాతో అందుకున్నారు.ఆ సినిమా ఇచ్చిన హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు కమల్ హాసన్.
విక్రం సినిమా 300 కోట్ల గ్రాస్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంది. కమల్ సినిమాల్లో ఇది సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.
అందుకే కమల్ ఆ సినిమాకు పనిచేసిన వారందరికి కానుకలు ఇస్తున్నాడు.అంతేకాదు విక్రం సినిమాతో వచ్చిన లాభాలతో కమల్ తనకు ఉన్న పాత అప్పులను కూడా తీర్చేస్తున్నాడని తెలుస్తుంది.
విక్రం సినిమాను రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానర్ లో కమల్ హాసన్ సొంతంగా నిర్మించారు.కమల్ హాసన్ విక్రం సినిమాతో వచ్చిన ఎమౌంట్ తో తన అప్పులతో పాటుగా తన పార్టీ ఫండింగ్ కి ఉపయోగిస్తున్నారని తెలుస్తుంది.
కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీథి మయ్యం కోసం కూడా ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది.మొత్తానికి కమల్ ఒక్క సినిమా హిట్ తో తనకున్న అప్పులు మిగతా ఖర్చులను కూడా నెట్టుకొచ్చేస్తున్నారు.
విక్రం హిట్ తో కమల్ ఆగిపోయిన తన సినిమాలను కూడా రీ స్టార్ట్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.శంకర్ డైరక్షన్ లో ఇండియన్ 2 సినిమా మొదలు పెట్టి మధ్యలో ఆపేశారు కమల్.
ఆ సినిమాతో పాటుగా శభాష్ నాయుడు కూడా తిరిగి లైన్ లోకి వస్తుందని అంటున్నారు.







