గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన విక్రమ్.. ఆందోళనలో అభిమానులు?

ప్రముఖ కోలీవుడ్ నటుడు చియాన్ విక్రమ్ ఉన్నఫలంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఈయనకు ఒకసారిగా గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం చెన్నైలోనే కావేరి ఆసుపత్రికి తరలించారు.

ఈ క్రమంలోనే నటుడు తీవ్ర గుండెపోటుకు గురయ్యారు అనే విషయం తెలియగానే అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం అభిమానులు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు.

ఇకపోతే సన్నిహితుల సమాచారం వైద్య సిబ్బంది సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇకపోతే నేడు సాయంత్రం 6 గంటలకు విక్రమ్ తన సినిమా పొన్నియిన్ సెల్వన్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఈయన ప్రస్తుతం హాస్పిటల్ పాలయ్యారు.

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలియడంతో అభిమానులు కాస్త ఊపిరి పిలుచుకున్నారు.

Advertisement

విక్రమ్ కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు.ఈయన కేవలం నటుడుగా మాత్రమే కాకుండా విలక్షణ నటుడిగా కూడా ఎంతో గుర్తింపు పొందారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన ప్రయాణం మొదలుపెట్టి ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.

విక్రమ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.విక్రమ్ మణిరత్నం దశకత్వంలోనూ, పా రంజిత్‌తో దర్శకత్వంలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు