కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.తమిళ్ ఇండస్ట్రీలో రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ లో ఫాలోయింగ్ అందుకుని దూసుకు పోతున్న విజయ్ సినిమాలంటే ఫ్యాన్స్ కు పండుగే.
ఈయన సినిమాల రిలీజ్ ముందే భారీ బిజినెస్ చేస్తుంటాయి.కోలీవుడ్ నే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈయనకు మార్కెట్ ఉంది.

దీంతో రిలీజ్ కు ముందే ఈయన సినిమాలు వందల కోట్ల బిజినెస్ చేస్తుంటాయి.మరి విజయ్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీకి కూడా భారీ బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తుంది.విజయ్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ‘లియో’ సినిమా( LEO Movie ) చేస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.ఇక ప్రమోషనల్ కంటెంట్ కూడా వదులుతూనే ఉన్నారు.
దీంతో ఈ సినిమాపై భారీ హైప్ పెరిగింది.
అందుకే రిలీజ్ ముందే భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంటున్నట్టు టాక్.కోలీవుడ్ హిస్టరీలోనే ఆల్ టైం బిగ్గెస్ట్ బిజినెస్ జరిగినట్టు టాక్ అందుతుంది.
లియో సినిమాకు వరల్డ్ వైడ్ గా అన్ని ప్రాంతాలలో థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ హక్కులు కలిపి ఏకంగా 400 కోట్ల పైమాటే అన్నట్టు కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

ఇదిలా ఉండగా సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష ( Trisha )హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.లోకేష్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.







