నా దూకుడు, పోరాటం వెనుక ఉండేది ఎప్పుడూ వారే.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి( vijayashanthi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

విజయశాంతి కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే.

ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకుంది.చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది.

సినిమాల్లోనే కాకుండా రాజకీయాలలో కూడా ఈమె రాణించారు.

కేవలం తెలుగు భాష లోనే కాకుండా తమిళం మలయాళం కన్నడ హిందీ భాషలలో కూడా నటించి స్టార్ హీరోయిన్ హోదా ను దక్కించుకుంది.ప్రస్తుతం ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో చేస్తున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా విజయశాంతి తన సోషల్ మీడియా(Social media ) ఖాతాలో ఒక వీడియోని షేర్ చేసింది.

Advertisement

ఆ వీడియోలో ఆమె ఈ విధంగా రాసుకొచ్చింది.నా తెంపరితనం, దూకుడు, పోరాటం ఎప్పుడు అభిమానులే, మీ వీడియో దృష్ట్యా ఇది, కళాకారిణిగా నాకు మీరు ప్రసాదించిన జన్మ బంధం, వరం ఎప్పటికి, మీరు అభిమానంతో ఇచ్చే ఈ గౌరవాన్ని కాపాడుకోవడంలో అదే మీ ఆవేశం, సినిమా అయినా ప్రజా జీవనమైనా నాకు ఎన్నటికి స్ఫూర్తిపూర్వకం మీ రాములమ్మ( Ramulamma ) అంటూ పోస్ట్ చేశారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ పోస్టుని చూసిన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.కామెంట్ ల రూపంలో ఆమెపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ఇకపోతే ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన విజయశాంతి ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.

టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!
Advertisement

తాజా వార్తలు