జవాన్ సినిమాకు విజయ్ సేతుపతి పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. మరీ అంతనా?

కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి గురించి మనందరికీ తెలిసిందే.విజయ్ సేతుపతి నటనకు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.

 Vijay Sethupathi Remuneration Shah Rukh Khan And Atlee Jawan , Vijay Setupathi ,-TeluguStop.com

భాష ఏదైనా పాత్ర ఏదైనా నటుడిగా ప్రేక్షకులను మెప్పించగల నటుడు విజయ్ సేతుపతి.కాగా తెలుగు ప్రేక్షకులకు విజయ్ సేతుపతి పేరు వినగానే ఉప్పెన సినిమాలో విలన్ గా నటించిన ఆయన పాత్రనే గుర్తుకు వస్తుంది.

ఉప్పెన సినిమాలో విలన్ గా నటించే ఊహించని విధంగా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు విజయ్ సేతుపతి.అంతేకాకుండా ఉప్పెన సినిమా తర్వాత ఈయనకు వరుసగా అవకాశాలు కూడా వచ్చాయి.

ప్రస్తుతం విజయ్ సేతుపతి టాలీవుడ్, బాలీవుడ్,కోలీవుడ్ లో వరుసగా సినిమాలు చూస్తూ దూసుకుపోతున్నాడు.కాగా ప్రస్తుతం విజయ్ సేతుపతి బాలీవుడ్ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌, కోలీవుడ్‌ డైరెక్టర్‌ అట్లీ కాంబినేషన్‌ లో తెరకెక్కబోతున్న జవాన్‌ సినిమాలో విలన్‌ గా నటిస్తున్నాడట.

కాగా ఈ సినిమా పాన్‌ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది.ఈ పాన్ ఇండియా సినిమా కోసం విజయ్ ని ఒప్పించడానికి అక్షరాలా 21 కోట్ల రూపాయలు పారితోషికం అందించనున్నారట.

ఇకపోతే విజయ్ సేతుపతి ఇటీవల విడుదలైన విక్రమ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

Telugu Bollywood, Jawan, Kollywood, Kollywood Atlee, Nayanthara, Shahrukh Khan,

ఈ సినిమాలో ఆయన నటించిన పాత్రకు మంచి స్పందన రావడంతో తన రెమ్యునరేషన్‌ ను రూ15 కోట్ల ఏకంగా 21 కోట్ల మేరకు పెంచాడట విజయ్‌ సేతుపతి.అంటే ఒక్క సినిమాతో దాదాపుగా ఆరు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ పెంచేశాడు.అంతేకాదు జవాన్‌ సినిమా కోసం అప్పటికే లైన్‌లో ఉన్న రెండు సినిమాలను కూడా అతడు వదిలేసుకున్నట్లు సమాచారం.

దీంతో జవాన్‌ సినిమా నిర్మాతలు అతడు అడిగినంత ఇచ్చేందుకు కూడా రెడీ అయ్యారట.కాగా ఇదిలా ఉంటే జవాన్‌ మూవీలో నయనతార హీరోయిన్‌ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

అలాగే ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తోందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube