కడప ఉక్కుపై గాలి దుమారం.. ఢిల్లీ కి విజయసాయి.

కడప లో తెలుగుదేశం ఎంపీ చేస్తున్న ఉక్కు దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.అలాంటిలాంటి పాపులారిటీ కాదూ.

కేంద్ర మంత్రి సీఎం రమేష్ కి కాల్ చేసి మరీ దీక్షని విరమించమని చెప్పారట దాంతో టీడీపీ ప్రభుత్వం దీక్షని ఇంకా పతాకస్థాయికి తీసుకువెళ్ళింది అయితే ఈ దీక్ష ఇలా జరుగుతుండగానే వైసీపి కీలక నేత విజయసాయి రెడ్డి హుటాహుటిన ఢిల్లీ వెళ్ళారు.అలా వెళ్ళిన ఆయన అక్కడ నిర్మలా సీతారామన్ ను కలిసి, ఎక్స్‌అప్రెంటిస్‌ ఉద్యోగుల సమస్యలు చెప్పారు అంటూ సాక్షి పత్రికలో వచ్చింది ఆ విషయాన్ని ఎంతో ఫోకస్ చేశారు కూడా అయితే ఈ చిన్న విషయంపై ఢిల్లీ వెళ్ళాలా అంటూ కామెంట్స్ కూడా వచ్చాయి.

అయితే విజయసాయి రెడ్డి ఢిల్లీ పర్యటన వెనుక పెద్ద మతలబే ఉంది అంటున్నారు.

అయితే ఇంత తొందరగా ఢిల్లీ వెళ్లి మరీ ఆయన గారు ఏమి చేశారు అంటే గాలి జనార్ధనరెడ్డి కి లాబీయింగ్ చేయడానికి వెళ్ళాడు అంటూ ఊహాగానాలు వస్తునాయిఇంత అర్జెంటుగా ఢిల్లీ వెళ్లి, చేసేది ఏంటి అంటే, గాలి జనార్ధన్ రెడ్డికి లాబీయింగ్ అనే వార్తలు వస్తున్నాయి.దీనికోసం పెద్ద స్కెచ్ వేశారట.సీఎం రమేష్ దీక్షతో హడాలిపోయిన కేంద్రం రమేష్ ఆరోగ్యం గురించి వాకబు చేస్తూనే మరో పక్క ఉక్కుపై ఎదో ఒక నిర్ణయం తీసుకోవలని డిసైడ్ అయ్యారట.

Advertisement

ఈ నేపధ్యంలో, కడప ఉక్కు పరిశ్రమ గాలికి కట్టబెట్టేలా, విజయసాయి లాబీయింగ్ చేస్తున్నారని తాజా సమాచారం ప్రకారం తెలుస్తోంది.ఈ ప్లాన్ లో భాగంగా ఉక్కు పరిశ్రమని పెట్టే యోచన ప్రభుత్వానికి లేదని చూపించి అందుకు గాను ప్రైవేటు ద్వారా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని.

దానికి గాలి రెడీగా ఉన్నాడు అంటూ.ఉక్కుని గాలి చేతికి వెళ్ళేలా ప్లాన్ సిద్దం చేస్తున్నాడట విజయసాయి రెడ్డి కడపలో ఉక్కుపరిశ్రమ కోసం సాగుతున్న ఉద్యమాల నేపథ్యంలో గాలి జనార్ధన్‌రెడ్డి చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

ఇన్నేళ్లుగా ఎక్కడ ఉన్నాడో తెలియని గాలి హఠాత్తుగా ఉక్కు పరిశ్రమను తానే నిర్మిస్తానని, అవకాశం తనకే ఇవ్వాలని రెండేళ్లలో పూర్తిచేస్తాననంటూ చెప్పడంతో.ప్రజా సొమ్ము మళ్లీ ఎక్కడగాలి పాలు అవుతుందోనన్న ఆందోళన ప్రజలను వేధిస్తోంది.

గతంలో గాలి బీజీపీ తోనూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ ని అడ్డం పెట్టుకుని అప్పట్లో కడప జిల్లా జమ్మలమడుగులో ఉక్కుపరిశ్రమ స్థాపనకు అనుమతిని పొందాడు.ఈ మేరకు ప్రభుత్వం ఎకరా రూ.18,500 చొప్పున దాదాపు 10760 ఎకరాలను బ్రాహ్మణి స్టీల్‌ ప్లాంట్‌కు అప్పగించింది.ప్రజల సొమ్ము కొల్లగొట్టి తిరిగి అదే పరిశ్రమను నిర్మిస్తానని ముందుకు రావడంతో మళ్ళీ అదే పరిస్థితి తిరిగి వచ్చేలా ఉందని అంటున్నారు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
వైరల్ వీడియో : కొత్త స్టైల్ లో ఇంట్లో చోరీలకు తెగబడ్డ దొంగలు..

అయితే కేంద్రంలో ఈ మధ్యకాలంలో విజయసాయి రెడ్డి లాబియింగ్ ద్వారా కడప ఉక్కుని గాలికి కట్టబెట్టడానికి భారీ వ్యుహాలే పన్నుతున్నారు అని అర్థం అవుతోంది.అంటున్నారు విశ్లేషకులు.

Advertisement

తాజా వార్తలు