టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ జంటగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది విజయ్ రష్మిక ( Vijay-Rashmika ) జంట.వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే గీత గోవిందం( Geetha govindam ), డియర్ కామ్రేడ్ ( Dear comrade ) వంటి సినిమాలు వచ్చాయి.
ఇక ఈ సినిమాల్లో నటిస్తున్న టైం లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని ఇండస్ట్రీలో ఒక రూమర్ గుప్పుమంది.

కానీ ఎన్నిసార్లు వీరి గురించి సంబంధించిన వార్తలు బయటికి వినిపించినా కూడా ఎక్కడా కూడా వీళ్ళు ప్రేమలో ఉన్నామనే విషయం బయట పెట్టడం లేదు.అయితే వీళ్ళు ఇప్పటికే ఎన్నో విషయాల్లో బయటపడ్డారు.కానీ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
మాల్దీవ్స్ ( Maldivs ) కి వెకేషన్ కి వెళ్ళినప్పుడు ఇద్దరూ ఒకేసారి వెళ్లినా అది బయటపడలేదు.అంతేకాకుండా వీళ్ళిద్దరూ ఒకే లొకేషన్ లో వాటర్ లో దిగిన ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొట్టింది.
దాంతో అక్కడ కనిపెట్టారు నెటిజన్స్.అలాగే విజయ్ రష్మిక ( Vijay-Rashmika ) ఇద్దరు కలిసి తమ ఫ్యామిలీతో రెస్టారెంట్లో డిన్నర్ కి వెళ్ళారు.
ఇక ఈ విషయం బయటపడ్డా కూడా మేం జస్ట్ ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా మంచి స్నేహితులు అని అబద్ధపు ప్రచారాన్ని చేశారు.

అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే తాజాగా రష్మిక ( Rashmika ) గతంలో విజయ్ దేవరకొండ ( Vijay deverakonda ) వేసుకున్న షర్టునే తాను కూడా వేసుకోవడంతో మరోసారి వీరి ప్రేమ విషయం బయటపడింది.ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టడంతో మరి ఈ ఫోటోకి ఏం అబద్ధం చెప్పి తప్పించుకుంటావ్ అని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.ఏది ఏమైనప్పటికీ వీరిద్దరి మధ్య ప్రేమ నిజమేనని, త్వరలోనే వీళ్లు పెళ్లి పీటలెక్కబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.విజయ్ రష్మిక ( Vijay-Rashmika ) ఇద్దరూ 2025లో తాము ఒప్పుకున్న సినిమా ప్రాజెక్టులు అయిపోయాక గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటారని ఒక టాక్ వినిపిస్తోంది.







