ఈ రోజు టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పుట్టిన రోజు అనే విషయం ఆయన ఫ్యాన్స్ కు బాగా తెలుసు.ఈయన బర్త్ డే కానుకగా విజయ్ నటిస్తున్న సినిమా నుండి అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ రోజు పుట్టిన రోజు కానుకగా విజయ్ కొత్త సినిమా నుండి మరో పోస్టర్ రిలీజ్ అయ్యింది.

విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) ప్రజెంట్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ప్రజెంట్ ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుగుతుంది.ఈ సినిమా నుండి కూడా బర్త్ డే కానుకగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యి ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ అయ్యింది.
ఇక విజయ్ ఈ సినిమాతో పాటు నెక్స్ట్ సినిమా కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

జర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ( Gowtam Tinnanuri) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. VD12 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఈ రోజు మరో కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేసారు.ఇందులో విజయ్ ఫేస్ సగం మాత్రమే కనిపించేలా రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు.
దీంతో ఈ సినిమా ఒక ఇంట్రెస్టింగ్ స్పై థ్రిల్లర్ గా ఉంటుంది అని అర్ధం అవుతుంది.ప్రతీ గూఢచారి కథ కూడా ఒక కుట్రతో ముగుస్తుంది.కానీ దీని వెనుక ఉన్న అసలు నిజం మార్చలేనిది అంటూ తెలిపారు.ఈ ఎమోషనల్ డ్రామా ఎలా ఉండబోతుందో వైట్ చేయాల్సిందే.







