విజయ్ మరో మూవీని లైన్లో పెట్టాడా.. ఆ సూపర్ హిట్ కాంబో మరోసారి రిపీట్!

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) ఈ మధ్యనే ఒక హిట్ అందుకుని ఖుషీగా ఉన్నాడు.”ఖుషి”( Khushi ) ఈ సినిమాతో ఎప్పటి నుండో అందని ద్రాక్ష లాగా మిగిలిన హిట్ అయితే రౌడీ స్టార్ కు దక్కింది.ఇదే ఊపులో మరో రెండు సినిమాలను స్టార్ట్ చేసి శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు.ఆ సినిమాల్లో గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న ప్రాజెక్ట్ ఒకటి.‘‘VD12” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల, విజయ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ పై గ్రాండ్ లెవల్లో నిర్మిస్తున్నారు.

 Vijay Deveakonda Next Movie With Director Rahul Sankrityan, Director Rahul Sankr-TeluguStop.com

అలాగే అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

Telugu Khushi, Parasuram, Sree Leela, Vd-Movie

అలాగే ”VD13” సినిమా కూడా తెరకెక్కుతుంది.విజయ్ 12వ సినిమా కంటే ఇది ముందు రిలీజ్ అవ్వనుంది.‘ఫ్యామిలీ స్టార్'( Family Star ) అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసినట్టు టాక్.పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది.
ఇదిలా ఉండగా విజయ్ ఈ రెండు సినిమాలతో బిజీగా ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టినట్టు తెలుస్తుంది.విజయ్ నటించిన టాక్సీవాలా కాంబో రిపీట్ కానున్నట్టు టాక్.

యంగ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ ( Director Rahul Sankrityan ) తో చేయబోతున్నట్టు టాక్.ఈయన శ్యామ్ సింగరాయ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న తర్వాత మరొక సినిమా చేయలేదు.

Telugu Khushi, Parasuram, Sree Leela, Vd-Movie

ఇక ఇప్పుడు విజయ్ తోనే నెక్స్ట్ సినిమాను చేసేందుకు సిద్ధం అయినట్టు తెలుస్తుంది.ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ యాక్షన్ మూవీగా ఉండనుందని సమాచారం.ఇప్పటికి రాహుల్ మూవీ స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడని టాక్.రాహుల్, విజయ్ సూపర్ హిట్ కాంబో మళ్ళీ రిపీట్ అయితే అంచనాలు పెరగడం ఖాయం.

ప్రస్తుతం ఉన్న రెండు సినిమాలు పూర్తి అయ్యాక విజయ్ వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమాను స్టార్ట్ చేసే అవకాశం ఉందట.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నట్టు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube