పరుశురాం డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా సినిమా ఫ్యామిలీ స్టార్.( Family Star Movie ) దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది.
విడుదల తేదీకి మరొక రెండు రోజులు మాత్రమే సమయం ఉంది.దాంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.
కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు టీజర్ లు ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి.ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఈ సందర్బంగా నేడు మంగళవారం సాయంత్రం ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్( Family Star Pre Release Event ) జరిగింది.ఇందులో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) మాట్లాడుతూ, బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.200 కోట్లు కొట్టి తీరుతా అని వెల్లడించారు.ఈ మూవీతోనే కొడతా అని చెప్పలేదుగానీ, కొట్టి తీరుతా, అప్పటి వరకు ఎన్ని తిట్లైనా భరిస్తానని తెలిపాడు విజయ్.
లాస్ట్ సినిమా సమయంలో 200 కోట్లు కొడుతున్నామనే స్టేట్‌మెంట్ ఇచ్చాను.కానీ కొట్టలేదు.దీంతో అంతా నన్ను తిట్టారు.నీ ఏజ్‌కి అలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వకూడదు, యారొగెన్సీ అనుకుంటారని చాలా మంది ప్రేమతో చెప్పారు, కొందరు కోపంతో చెప్పారు.
కానీ రెండు వందల కోట్లు( 200 Crores ) కొడతానని స్టేట్‌మెంట్ ఇవ్వడం తప్పుకాదు, ఇచ్చిన కొట్టకపోవడం తప్పు.ఆ విషయంలో ఈ తిట్లకి, కామెంట్లకి నేను అర్హుడినే.కానీ ఇప్పుడు చెబుతున్నా, రెండు వందల కోట్లు కొట్టేంత వరకు ఎన్ని తిట్లైనా తిట్టండి.కానీ ఏదో రోజు కొట్టి తీరుతాను.ఇది నేను యారోగెన్సీతో, యాటిట్యూడ్‌తో చెబుతున్న విషయం కాదు, నాపై నాకున్న కన్ఫిడెన్స్ తో చెబుతున్న మాట అని అన్నారు విజయ్ దేవరకొండ.కాగా ఈ సందర్బంగా విజయ్ చేసిన వాఖ్యలు వైరల్ గా మారాయి.
విజయ్ చేసిన వాఖ్యలపై కొందరు నెగిటివ్ గా స్పందిస్తుండగా మరికొందరు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.