క్రియేటివ్ డైరెక్టర్‌తో రౌడీ సినిమా.. స్టార్ హీరోలకు ఎసరు!

టాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ, రౌడీ హీరోగా మారి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.ఇప్పటికే పలు సెన్సేషనల్ చిత్రాల్లో నటించిన విజయ్ దేవరకొండ, ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో ఫైటర్ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు.

 Vijay Devarakonda Next Movie With Sukumar Confirmed, Vijay Devarakonda, Sukumar,-TeluguStop.com

ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు విజయ్ దేవరకొండ రెడీ అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా, కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

కాగా తాజాగా విజయ్ దేవరకొండ తన నెక్ట్స్ చిత్రాన్ని ఓ స్టార్ డైరెక్టర్‌తో చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు.ఈ సినిమాను క్రియేట్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో రాబోతున్నట్లు విజయ్ దేవరకొండ అధికారికంగా ప్రకటించాడు.

పాన్ ఇండియా చిత్రంగా రానున్న ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కించేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు.కాగా ఈ సినిమాలో పలువురు బాలీవుడ్ నటులు కూడా నటించనున్నట్లు తెలుస్తోంది.

ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రానున్నట్లు రౌడీ హీరో ప్రకటించాడు.భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను విజయ్ దేవరకొండ ఇమేజ్‌ను పూర్తిగా మార్చడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

అయితే ఈ సినిమాను 2022లో పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.కాగా ఇప్పటికే సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో ముచ్చటగా మూడోసారి జతకట్టి ‘పుష్ప’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే సుకుమార్‌తో విజయ్ దేవరకొండ చేయబోయే సినిమాతో స్టార్ హీరోలకు రౌడీ ఎసరు పెట్టడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఇక ఈ సినిమాను ఏ జోనర్‌లో తెరకెక్కిస్తారా, ఇందులో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనే అంశాలు తెలియాలంటే మాత్రం మరికొంత కాలం ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube