లైగర్ సినిమా విజయ్ ను పూర్తిగా మార్చేసిందా.. ఇక ఆ యాటిట్యూడ్ కష్టమే!

విజయ్ దేవరకొండ పేరు వినగానే ఆయన యాటిట్యూడ్ అందరికి కనిపిస్తుంది.ఈయన అన్ని పనుల్లో దూకుడు, ఏ ప్రశ్నకు అయినా బోల్డ్ గా ఆన్సర్ చేసే ఈయన స్టైల్ కు భారీ ఫ్యాన్స్ ఉన్నారు.

 Vijay Devarakonda Latest News , Vijay Deverakonda , Kushi , Liger , Rowdy Star,-TeluguStop.com

అందుకే విజయ్ ను ముద్దుగా రౌడీ స్టార్ అని పిలుచు కుంటారు.ముఖ్యంగా యువత ఈయన స్టైల్ కు ఫిదా అయిపోయారు అనే చెప్పాలి.

ఈయన మీద ఈయనే పంచ్ లు వేసుకుని మరీ ఎదుటి వారి నోరును మూయించడం ఈయనకే చెల్లింది.

అయితే లైగర్ సినిమా ముందు పాన్ ఇండియా పాపులారిటీ సొంతం చేసుకున్న ఇతడిని చూసి స్టార్ హీరోలు సైతం ఆశ్చర్య పోయారు.

అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత విజయ్ పూర్తిగా మారిపోయినట్టే కనిపిస్తుంది.వరుస ప్లాప్స్ తో ఇతడి యాటిట్యూడ్ తగ్గినట్టే అనిపిస్తుంది.

Telugu Kushi, Liger, Rowdy, Saima-Movie

ఇటీవలే లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.లైగర్ కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది.ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాల రిలీజ్ అయ్యింది.లైగర్ ప్రమోషన్స్ సమయంలో ఇతడి యాటిట్యూడ్ అందరిని ఆకట్టుకుంది.చాలా కాన్ఫిడెంట్ గా ఎక్కడ కనిపించిన తాను ఇలాగె ఉంటా.ఇలాగే మాట్లాడుతా అనే విధంగా చూపించాడు.

అయితే ఈ సినిమా ఎంత హైప్ క్రియేట్ అయ్యిందో అంత బెడిసి కొట్టింది.

దీంతో విజయ్ చాలా కృంగిపోయినట్టు అనిపిస్తుంది.

ఇతడిపై బాగా ట్రోలింగ్ జరగడంతో ఇతడి పద్ధతి మారినట్టు అనిపిస్తుంది.లైగర్ సమయంలో చేసిన అతి ఇతడికి నెగిటివ్ ఇంప్రషన్ క్రియేట్ చేసింది.

మరి లైగర్ ప్లాప్ తో షాక్ అయినా విజయ్ తనని తాను పూర్తిగా మార్చుకున్నట్టే అనిపిస్తుంది.

Telugu Kushi, Liger, Rowdy, Saima-Movie

లైగర్ తర్వాత బయట పెద్దగా కనిపించడం లేడి.ఇటీవలే సైమా వేడుకల్లో కనిపించి మాట్లాడిన మాటలు చూస్తుంటే ఇతడు మారిపోయినట్టే అనిపిస్తుంది.ముందు ఉన్న ఉత్సాహం లేదు అనే చెప్పాలి.

మరి మళ్ళీ హిట్ వచ్చిన ఇంత యాటిట్యూడ్ అయితే చూపించే అవకాశాలు కనిపించడం లేదు.చూడాలి ఇప్పుడు చేస్తున్న ఖుషి సినిమాతో అయినా ఇతడు హిట్ కొడతాడా లేదా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube