వారికి తెలియకుండా పెళ్లి చేసుకోను.. మనం కూడా బ్రతకాలి కదా: విజయ్ దేవరకొండ

నటుడు విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) త్వరలోనే ఫ్యామిలీ స్టార్ ( Family Star ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

 Vijay Devarakonda Crazy Comments On His Marriage ,vijay Devarakonda, Father, Mo-TeluguStop.com

దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించినటువంటి ఈ సినిమా విడుదల అవుతున్నటువంటి తరుణంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి విజయ్ దేవరకొండ తన పెళ్లి ( Marriage ) గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

గత ఇంటర్వ్యూలలో భాగంగా ఈయన పెళ్లి గురించి మాట్లాడుతూ తప్పకుండా తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని నాకు కూడా తండ్రి కావాలని ఉంది అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.అయితే తాజాగా మరోసారి పెళ్లి గురించి కూడా ఈయన మాట్లాడుతూ… నా పెళ్లి విషయంలో ఎప్పటి నుంచో నాకు బాగా క్లారిటీ ఉంది.నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అమ్మానాన్నలకు కూడా ఖచ్చితంగా నచ్చాలని వారికి చెప్పకుండా వారికి నచ్చకుండా తాను పెళ్లి చేసుకోనని ఈయన వెల్లడించారు.

వారికి నచ్చేటట్లు ఒప్పించే బాధ్యత కూడా మన పైనే ఉంటుందని విజయ్ దేవరకొండ తెలిపారు.పెళ్లి చేసుకున్న తర్వాత 30 సంవత్సరాల పాటు మనం కలిసి బ్రతకాలి కదా అందుకే అన్ని నచ్చే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మనదని తెలిపారు.అయితే దీనికి ఇంకాస్త టైం ఉందంటూ ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన పెళ్లి గురించి అలాగే తన పెళ్లి అమ్మ నాన్నలకు నచ్చేలాగే చేసుకుంటాను అంటూ ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube