రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన ఇటీవల హాలిడేస్ కోసం మాల్దీవ్స్ కి వెళ్ళిన విషయం తెలిసిందే.అక్కడ దాదాపు నాలుగు రోజుల పాటు వీరిద్దరూ ఎంజాయ్ చేశారు.
వీరిద్దరితో పాటు స్నేహితులు ఉన్నారా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు.రష్మిక మందన సోలో ఫొటోస్ ని సోషల్ మీడియాలో తెగ షేర్ చేసింది.
ఇక ఆ విషయం పక్కన పెడితే తాజాగా వీరిద్దరూ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు అని సమాచారం అందుతుంది.వెళ్లే సమయంలో విడివిడిగా వెళ్లి కలిసి విమానం ఎక్కారు, కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం రాత్రి సమయంలో కలిసే ఒకే కారులో వెళ్లి పోయారు అంటూ సమాచారం అందుతుంది.
ఈ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు.కానీ ఎవరికీ తోచిన విధంగా వారు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు ఈ విషయమై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు, తాము ఇద్దరం మంచి స్నేహితుల మాత్రమే అంటూ పదే పదే వారు చెబుతున్నారు.అయినా కూడా కొందరు సోషల్ మీడియా లో ఇష్టానుసారంగా వారి మాల్దీవ్స్ ట్రిప్ గురించి కామెంట్స్ చేస్తున్నారు.కొందరు ఏకంగా ప్రీ వెడ్డింగ్ షూట్ మాదిరిగా ఫ్రీ వెడ్డింగ్ హనీమూన్ ట్రిప్ అంటూ ప్రచారం చేస్తూ విజయ్ దేవరకొండ పై విమర్శలు గుప్పిస్తున్నారు.ఇక విజయ్ దేవరకొండ హాలిడేస్ నుండి తిరిగి రావడంతో ఆయన మళ్లీ శివ నిర్వాన దర్శకత్వంలో ఖుషి సినిమా షూటింగ్ తో బిజీ అయ్యే అవకాశం ఉంది.
సమంత కూడా ఇటీవలే విదేశాల నుండి తిరిగి వచ్చింది.వీరిద్దరూ కలిసి మళ్ళీ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు.
శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి అవ్వబోతున్నాయని తెలుస్తుంది.ఖుషి సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరి వరకు పూర్తి అయ్యే అవకాశం ఉందని.
వచ్చే ఏడాది లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారని అంటున్నారు.