తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్( Lokesh Kanagaraj ) దర్శకత్వం లో రూపొందిన లియో సినిమా ను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి.సెన్సార్ కార్యక్రమాలతో సహా అన్నీ పూర్తి చేసిన లోకేష్ కనగరాజ్ సినిమా ప్రమోషన్ లో బిజీ అయ్యాడు.
సోషల్ మీడియా ద్వారా లియో కి కావాల్సినంత ప్రీ పబ్లిసిటీ దక్కింది… ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది.తాజాగా ట్రైలర్ విడుదల అయిన తర్వాత అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరిగాయి.
సాధారణంగానే తమిళ్ లో విజయ్ సినిమా లు వందల కోట్ల వసూళ్లు నమోదు చేయడం ఖాయం.

ఇక లోకేష్ కనగరాజ్ దర్శకత్వం లో సినిమా కనుక ఆ మొత్తం డబుల్ అవ్వడం ఖాయం.ఇక ఇతర భాష ల్లో కూడా లోకేష్ కనగరాజ్ కి మంచి పేరు ఉంది.అందుకే అన్ని భాష ల్లో కూడా లియో కి విపరీతమైన రేటు తో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.తమిళ్ మరియు ఇతర భాషల్లో కలిపి మొత్తంగా ఈ సినిమా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.500 కోట్ల ను దక్కించుకుంది అంటున్నారు.నిర్మాత పెట్టిన పెట్టుబడి దాదాపుగా 250 కోట్లు.కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ తో ఏకంగా అయిదు వందల కోట్ల రూపాయలు వచ్చాయట.

విజయ్( Vijay ) ఈ సినిమా కి లాభాల్లో వాటాను కూడా అందుకోబోతున్నాడు.వంద కోట్ల పారితోషికం లాభాల్లో వాటా తో ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి అయ్యే సమయంకు విజయ్ కి మరో యాబై కోట్ల పారితోషికం ముట్టింది.సినిమా విడుదల అయ్యి ఏమాత్రం పాజిటివ్ టాక్ దక్కినా కూడా భారీ వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం.అందుకే ఈ సినిమా తో విజయ్ సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశాలు ఉన్నాయి.
తమిళ్ తంబీలు ఎక్కువగా వెయ్యి కోట్ల మార్క్ పై దృష్టి పెట్టి ఉన్నారు.ఆ స్థాయి లో వసూళ్లు రాకున్నా కూడా కచ్చితంగా భారీ వసూళ్లు లియో కి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.