వీడియో: నిద్రపోతున్న తోటి సైనికుడిని లేపడానికి వీరేం చేశారో చూస్తే...

యుద్ధం చేసే సైనికుల జీవితాలు రేపో మాపో అన్నట్లు ఉంటాయి.ప్రాణాలను రక్షించేందుకు వీరు నిత్యం అలర్ట్ గా ఉండాలి.

 Video: Watch What They Did To Wake Up A Sleeping Soldier , Viral News, Latest-TeluguStop.com

అలాగే ఉంటూ వీరు శత్రువులను అంతమోదించేందుకు వ్యూహాలు పన్నుతుంటారు.అలాగే ఏమాత్రం నిర్లక్ష్యంగా ప్రవర్తించకుండా ఎప్పుడూ అలర్ట్ గా ఉంటారు.

అయితే ఒక సైనికుడు మాత్రం యుద్ధం రంగంలో హాయిగా కునుకు తీశాడు.హాయిగా ఒక ఆర్మీ వెహికల్ టైర్ కి అనుకొని అతడు నిద్రించాడు.

అయితే ఇది చూసి తోటి సైనికులు షాక్ అయ్యారు.తర్వాత ఆ సైనికుడిని లేపాలని నిర్ణయించుకున్నారు కానీ మామూలుగా కాదు.

సదరు సైనికుడు ఉలిక్కిపడేలా చేసి ఆశ్చర్యపోయేలా చేద్దామనుకున్నారు.

అందుకు ఒక రాకెట్ లాంచర్( Rocket launcher ) ప్రయోగించాలని అనుకున్నారు.అప్పటికి అతడు లేవకపోవడంతో ఆ వెపన్ నుంచి ఒక రాకెట్ లాంచ్ చేశారు.దానివల్ల చాలా పెద్ద సౌండ్ వచ్చింది.

దాంతో నిద్రపోతున్న సదరు సోల్జర్( Soldier ) ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు.యుద్ధం నడుస్తుందేమో అని అటూ ఇటూ అయోమయంగా చూశాడు.

అతడి రియాక్షన్ చూసి తోటి సైనికులు తెగ నవ్వుకున్నారు.చాలా సీరియస్‌గా ఉండాల్సిన సైనికులు ఇలా ఫన్నీ ప్రాంక్‌లు చేసుకుంటూ ఉండటం నిజంగా ఆశ్చర్యకరమే.

దీనికి సంబంధించిన వీడియోను @InsaneRealitys ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.ఏడు లక్షల 50 వేలకు పైగా వ్యూస్‌తో ఇది సోషల్ మీడియా( Social media )లో బాగా వైరల్ అవుతుంది.

వీళ్లు కెనడియన్ సోల్జర్స్ అని ట్విట్టర్ పేజీ ఒక క్యాప్షన్ జోడించింది.

ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు నవ్వుకుంటున్నారు.అయితే “ఇదొక ట్రైనింగ్ సెషన్ అయి ఉంటుంది.పాపం అతడు చిన్న బ్రేక్ తీసుకున్నాడు.

అది కూడా మిగతావారు డిస్టర్బ్ చేశారు” అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.పాపం అతడు చాలా భయపడ్డాడు, కొంచెం మానవత్వం చూపించండి అని మరికొందరు సోల్జర్స్ ని తిట్టారు ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube