వీడియో: గుజరాత్‌లో విషాదం.. కుమారుడి బర్త్‌డే పార్టీలో తల్లికి గుండెపోటు..

ఈరోజుల్లో పార్టీల్లో డ్యాన్స్ చేస్తూ గుండె పోటుకు గురై చనిపోయే వారి సంఖ్య పెరుగుతోంది.చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మందికి సడన్ గా గుండెపోటు రావడం ఆపై వాళ్లు మరణించడం జరుగుతోంది.

 Video Tragedy In Gujarat, Mother Suffers Heart Attack At Son's Birthday Party, H-TeluguStop.com

తాజాగా ఇలాంటి విచారకరమైన సంఘటన గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో( Valsad district of Gujarat ) జరిగింది.ఒక బాలుడి పుట్టిన రోజు వేడుక జరుగుతున్న సమయంలో అతని తల్లికి గుండెపోటు వచ్చింది.

ఈ దృశ్యం చూసి అందరూ షాక్ అయ్యారు.ఏమైందో అని తెలుసుకునేలోపే ఆమె అక్కడికక్కడే మరణించింది.

కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ఆ వేడుక చేస్తున్న సమయంలో ఈ దురదృష్టకరం సంఘటన జరిగింది.అందరూ ఆనందంగా డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఆ మహిళ తన భర్త భుజం మీద తల వాల్చి ఆకస్మాత్తుగా కింద పడిపోయింది.అందరూ భయంతో అటూ ఇటూ పరుగులు తీశారు.ఈ దృశ్యం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.

ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పటికీ, వైద్యులు ఆమె ఆల్రెడీ మరణించిందని ప్రకటించారు.ఇలా ఒక సంతోషకరమైన వేడుక క్షణాల్లో విషాదాంతం అయింది.ఈ సంఘటన రాయల్ షెల్టర్ హోటల్‌లో జరిగింది.అక్కడే కుటుంబ సభ్యులందరూ కలిసి చిన్నారి పుట్టిన రోజు సెలెబ్రేట్ చేశారు.వీడియోలో అందరూ డ్యాన్స్ చేస్తూ హాయిగా కనిపించారు, ఆ తల్లి, ఆమె భర్త, వారి పిల్లలు స్టేజ్ మీద నిలబడి ఉన్నారు.ఆ బాలుడి పేరు గౌరిక్.

అతడి 5వ బర్త్ డే సెలెబ్రేషన్స్‌లో తల్లి యామినిబెన్ స్టేజీ మీద నుంచి కింద పడిపోయింది.అక్కడ ఉన్న వాళ్ళు వెంటనే యామినిబెన్ కు సహాయం చేయడానికి వెళ్ళారు.

కానీ ఫలితం లేకుండా పోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube