చిన్నారిలకు సంబంధించిన వీడియోలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.చిన్ననాటి జ్ఞాపకాలను కూడా గుర్తుకు తెస్తాయి.
అలాంటి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఓ చిన్నారి తన అమాయకపు చేష్టలతో నెటిజన్ల మనసులను దోచేస్తున్నాడు.
ఈ వీడియోలో ఆ బుడ్డోడు ఒక నీటి పైపు పట్టుకొని దానితో ఆడుకుంటూ కనిపించాడు.అప్పుడే ఆ పైపులో నుంచి నీళ్లు రావడం చూసి అవాక్కయ్యాడు.
అప్పుడు ఆ బుడ్డోడు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ అమూల్యమైనవని అని చెప్పవచ్చు.ఈ దృశ్యాలను సంబంధించిన ఒక వీడియో ఫేస్‌బుక్‌లో షేర్ చేయగా ఇప్పుడు అది వైరల్ గా మారింది.
39 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో.ఓ చిన్నారి పైపును తన చేతిలో పట్టుకొని ఉండటం గమనించవచ్చు.
కొంత సమయం తర్వాత దాని నుంచి వాటర్ బయటకు వస్తాయి.అయితే ఈ దృశ్యాన్ని చూసి ఆ పిల్లవాడు కాస్త ఆశ్చర్యపోతాడు.
ఆ తర్వాత నీటిని మొక్కలకు పోసేందుకు ప్రయత్నిస్తాడు.ఈ సమయంలోనే పైప్‌ను అతను కొంచెం పక్కకి తిప్పి పట్టుకోవడంతో నీళ్లు తనపై పడతాయి.
దీంతో ఉలిక్కిపడతాడు.తనపై ఎవరు నీళ్ళుపోస్తున్నారు? అనుకుంటూ తన అమాయకత్వంతో చుట్టూ చూస్తాడు.ఆ తర్వాత కూడా ఆ పిల్లవాడిపై నీళ్లు పడుతూనే ఉంటాయి.ఎందుకంటే ఆ పిల్లవాడు ఆ పైప్ ను తనపై నెత్తిపైన వాటర్ పడేలాగా పట్టుకున్నాడు.కానీ అది అర్థం కాక ఎవరో తనపై నీళ్లు పోస్తున్నారని అనుకుంటున్నాడు.ఆ అమాయకత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఈ ఫన్నీ, క్యూట్ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి
.






