వీడియో: బాయ్‌ఫ్రెండ్‌ని కలవడానికి 12,000 కి.మీ ప్రయాణించిన గర్ల్‌ఫ్రెండ్.. చివరికి..?

లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్స్‌ ( Long distance relationships )స్టార్ట్ చేయడం చాలా సులభం కానీ టైం గడుస్తున్న కొద్దీ కలవాలనే కోరిక పుడుతుంది.

ఎంతకీ కలవకపోతే ప్రేమ అనేది తగ్గుతూ వస్తుంది.

ఈ సోషల్ మీడియా యుగంలో ఒకరినొకరు రోజూ ఏం చేస్తున్నారో తెలుసుకోవడం చాలా సులభమైంది.అయినా, దూరంగా ఉండటం బాధ కలిగిస్తుంది.

మొబైల్‌లో మాట్లాడుకోవడం ప్రత్యక్షంగా కలిసి ఉండటం లాగా ఉండదు.అందుకే కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌కు ఫుల్ స్టాప్ పెట్టి కలవాలనుకుంటారు.

అందుకు వేల కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణించడానికి సిద్ధమవుతారు.తాజాగా ఒక యువతి అదే పని చేసింది.

Advertisement

ఆమె ఒక యువకుడితో లాంగ్ రిలేషన్‌షిప్‌లో ఉంది.వారిద్దరూ 12 వేల కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్నారు.

దీని కారణంగా కలవలేక పోతున్నారు.వీరు గాఢంగానే ప్రేమించుకుంటున్నారు.

దూరం మాత్రమే వారికి అడ్డంకే అయింది.అయితే ఆ అడ్డంకిని ఆమె చాలా సులభంగా అధిగమించింది.

తాను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న యువకుడిని కలవడానికి ఏకంగా 12 వేల కిలోమీటర్లు ప్రయాణించింది.తాను ఆ అబ్బాయిని కలుస్తున్నట్లు ముందుగా చెప్పలేదు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
వీడియో వైరల్ : ఏంటి రింకూ సింగ్ మరీ డబ్బులు అంత ఎక్కువయ్యాయ?

సర్‌ప్రైజ్ చేద్దామని భావించింది.ఒకరోజు ఆమె బాయ్‌ఫ్రెండ్ తన ఫ్రెండ్ తో కలిసి క్యాజువల్ గా రెస్టారెంట్లో కూర్చొని టైం స్పెండ్ చేస్తున్నాడు.

Advertisement

అదే రెస్టారెంట్‌కి( restaurant ) వచ్చిన ఆమె వెనుక నుంచి అతడిని చూస్తూ ఉండిపోయింది.ఫ్రెండ్ సైగ చేయడంతో అతను వెనక్కి చూశాడు.అంతే తను ప్రేమిస్తున్న అమ్మాయి కనిపించడంతో ఒక్క సారిగా షాక్ అయ్యాడు.

తాను రోజూ మాట్లాడే అమ్మాయి సడన్‌గా తన కళ్ల ముందు ప్రత్యక్షం కావడంతో ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియని విధంగా అతను ఉండిపోయాడు.చివరికి గర్ల్‌ఫ్రెండ్( Girlfriend ) ముందుకు వచ్చి అతని పక్కన కూర్చుని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది.

దాంతో ఆమె అక్కడే ఉందని అతను రియలైజ్ అయ్యాడు.

తర్వాత ఆమెను గట్టిగా హత్తుకున్నాడు.రెండు మనసులు కలిసిన తర్వాత వారిద్దరూ భౌతికంగా కలిస్తే వచ్చే ఆనందమే వేరు అలాంటి ఆనందాన్ని ఈ ప్రేమికులు ఆస్వాదించారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్ ను ఫ్రెండ్ తన కెమెరాలు రికార్డ్ చేశాడు దాన్ని చూసి చాలా మంది ముద్దుల అవుతున్నారు.ఇలాంటి మరిన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నారు.

రెడిట్‌లో ఈ వీడియోను షేర్ చేశారు.

https://www.reddit.com/r/MadeMeSmile/comments/1f3s3oj/she_flew_12000kms_just_to_surprise_her_boyfriend/?utm_source=share&utm_medium=mweb3x&utm_name=mweb3xcss&utm_term=1&utm_content=share_button

తాజా వార్తలు