వీడియో: కారుపై గీతలు గీసిన ఆకతాయి.. పట్టుకొని వీరబాదుడు బాదిన యజమాని..

ఈ ప్రపంచంలో ఇతరులకు మంచి చేసేవారు ఎంతమంది ఉన్నారో చెడు చేసే వారు కూడా అదే సంఖ్యలో ఉన్నారు.ఎలాంటి పగ లేకపోయినా, లేదంటే ఇతరులు తెలియకపోయినా వారి వస్తువులను కావాలనే పాడుచేసి శునకానందం పొందే వారు ఎందరో.

 Video The Brat Who Drew Lines On The Car Caught And Beat The Owner , Viral Video-TeluguStop.com

ఒక్కోసారి అలాంటివారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడుతూ తన్నులు తింటుంటారు.దేహశుద్ధి బాగా జరిగితే తప్ప వీరికి ఇతరుల వస్తువులకు హాని కలిగించకూడదనే బుద్ధి రాదు.

అయితే తాజాగా ఇలాంటి ఓ ఆకతాయి వ్యక్తికి ఒక కారు ఓనర్ సరైన గుణపాఠం నేర్పించాడు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి కారుపై తాళం చెవి పెట్టి గీస్తూ వెళ్లడం చూడవచ్చు.దీనివల్ల కారుపై బాగా గీతలు పడుతున్నాయి.లక్షల విలువైన కారు అందాన్ని అతడు నాశనం చేస్తున్నాడు.ఈ కారు ఒక రెస్టారెంట్ ముందు ఆగి ఉన్నట్లు కనిపించింది.ఆ రెస్టారెంట్లో యజమాని భోంచేస్తున్నాడు.అయితే తన కారుపై గీతల గీస్తున్న వ్యక్తిని చూసి అతడు ఆగ్రహానికి గురయ్యాడు.

అనంతరం పరిగెత్తుకుంటూ వచ్చి సదరు ఆకతాయిపై పంచుల వర్షం కురిపించాడు.దాంతో సదరు ఆకతాయి కింద పడిపోయాడు.

యజమానికి అప్పటికీ కోపం తగ్గలేదు.అందుకే అతడిని ఇంకా పిడుగుద్దులు గుద్దుతూ, తన్నేస్తూ పిచ్చికొట్టుడు కొట్టాడు.

తర్వాత అతని ఫ్రెండ్స్ వచ్చి ఆపు రా బాబు సచ్చిపోతాడేమో అన్నట్లు అతడిని వెనక్కి లాగేసారు.దీనికి సంబంధించిన వీడియోను నాన్ అస్తేటిక్ థింగ్స్ (@nonaestheticthings) అనే ప్రముఖ సోషల్ మీడియా అకౌంట్ షేర్ చేసింది.

దీన్ని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube