యూరప్, నార్త్ అమెరికా దేశాల్లో హాలోవీన్ పండుగను( Halloween festival ) చాలా ఘనంగా జరుపుకుంటారు ఈరోజే చనిపోయిన పూర్వీకుల ఆత్మలు తమ ఇంటికి వస్తాయని భావిస్తారు.దానికి గుర్తుగా వారు ఆత్మల లాంటి రకరకాల కాస్ట్యూమ్స్ ధరించే ఆశ్చర్యపరుస్తుంటారు అయితే ఫుడ్ విషయంలో కూడా ఇలాంటి ట్రెండ్ ఫాలో అవుతూ కొందరు షాక్ ఇస్తున్నారు.
హాలోవీన్ ఏడాది అక్టోబర్ 31న జరుపుకొనున్నారు.ప్రజలు తమ ఇళ్లను గుమ్మడికాయలు, అస్థిపంజరాలతో( Pumpkins, with skeletons ) అలంకరించడం, మర్డర్ మిస్టరీల వంటి బ్యాక్‌గ్రౌండ్ పార్టీలను ప్లాన్ చేయడం ద్వారా భయానక వాతావరణాన్ని ఆల్రెడీ క్రియేట్ చేసేసారు అయితే మీకు భయం కలిగించే వంటకాన్ని ఎప్పుడైనా చూసారా? పుర్రెలా కనిపించే పిజ్జా – గగుర్పాటు కలిగించే భోజనాన్ని చూపించే ఇన్‌స్టాగ్రామ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.పుర్రేంటి, పిజ్జా ఏంటి అని మీరు ఆశ్చర్యపడిన సరే ఇది నిజం.ఈ వీడియో భోజన ప్రియులకు భయం కలిగిస్తోంది.ఆ వైరల్ వీడియో పిజ్జా స్కల్స్ అని పెద్ద గుర్తు ఉన్న స్ట్రీట్ కార్ట్ షాట్‌తో ప్రారంభమవుతుంది.
అప్పుడు, ఒక పాన్‌లో వేయించే పుర్రె ఆకారంలో ఉన్న పిజ్జా( Pizza ) మనకు కనిపిస్తుంది.తరువాత, ఈ భయానక ఫుడ్ ఐటమ్‌పై ఆరంజ్ సాస్ జాగ్రత్తగా పూయడం గమనించవచ్చు.మయోనైస్, కెచప్ స్మార్ట్ మిక్స్‌తో తయారు చేసిన కళ్ళు, ముక్కు, నోరును ఈ ఫుడ్ ఐటమ్‌పై చక్కగా పేర్చడం కూడా గమనించవచ్చు.
మొత్తం మీద ఈ పిచ్చా ఒక పుర్ర ఆకారంలో కనిపిస్తూ అందరినీ జడుసుకునేలా చేస్తోంది.ఇది ఎక్కడ దొరుకుతుంది, దాని ధర ఎంత అని మీరు తెలుసుకోవాలనుకుంటే, ఈ స్కల్ పిజ్జా బిలాస్‌పూర్‌లోని శ్రీకాంత్ వర్మ మార్గ్‌లో రూ.100 లభిస్తుందని వీడియో క్యాప్షన్ చెబుతుంది.వీడియోని @ Foodie Cockroaches అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ షేర్ చేసింది.
అక్టోబర్ 12న అప్‌లోడ్ అయిన ఈ వీడియో పది లక్షలకు పైగానే వ్యూస్ సంపాదించింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు “దీన్ని ఎవరు తింటారు, ఇదొక దిక్కుమాలిన ఫుడ్.ఇలాంటి ఆకారం చూస్తేనే భయమేస్తోంది.” అని కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నామని కామెంట్ పెట్టారు.