సర్వమతాలకు పుట్టినిల్లు మన భారత దేశం. ఇక్కడ ప్రతిఒక్కరు తమ ఇష్ట దైవాలని మనసారా పూజిస్తారు.
ఇంకా దైవ ప్రతిమలను ఎంతో ఆరాధనగా చూస్తారు.ఎటువంటి పరిస్థితులలోను సదరు విగ్రహాల విషయంలో నిర్లక్ష్యం వహించరు.
వాటిని ఎక్కడ ప్రతిష్టించాలో అక్కడే అన్ని లాంఛనాలతో ప్రతిష్టిస్తారు.ఒకవేళ పాడైన విగ్రహాలను కూడా అంటే ఆరాధనతో గంగలో కలిపేస్తారు.
అయితే తాజాగా హిందువులు ఎంతో ప్రేమగా కొలిచే జగన్నాథుని ప్రతిమకు అగౌరవం కలిగింది.అవును, ఆ దేవుడి విగ్రహాన్ని నిర్లక్ష్యంగా వెదురు కర్రల లోడ్‌తో ట్రక్కులో వేసి తీస్తుకెళ్తుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జాతీయ రహదారిపై ట్రక్కు వెళ్తుండగా వీడియో తీసిన కొందరు స్థానికులు దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ తంతు కాస్త వెలుగు చూసింది.ఇక సదరు క్లిప్‌పై నెటిజన్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
గురువారం భువనేశ్వర్-జలేశ్వర్ హైవేపై ప్రయాణిస్తున్న ‘బినయ్ ప్రధాన్’ అనే వ్యక్తి వ్యాన్‌కు వేలాడుతున్న విగ్రహాన్ని తాడుకు కట్టి ఉంచి తీసుకెళ్తుండగా స్థానికులు వీడియో తీశారు.ఇదే వీడియో వైరల్ అవుతోంది.
వీడియో వైరల్ కావడంతో, నెటిజన్లు విగ్రహాన్ని తీసుకువెళుతున్న అజాగ్రత్త విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.

ఇక ఈ విషయమై సదరు వాహనం, టెంట్ హౌజ్ యజమాని స్పందించారు.బాలాసోర్‌లోని గణేష్ పూజా పండులో విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తర్వాత జగన్నాథుని విగ్రహంతో పాటు ఇతర సామాగ్రి తన స్వగ్రామమైన జలేశ్వర్‌కు తరలిస్తున్నట్లు ఆ యజమాని తెలిపారు.అయితే సరిగ్గా అదేరోజు తాను స్టేషన్‌లో లేనని, తన వద్ద పనిచేస్తున్న కార్మికులు ఒడియాయేతరులు కావటంతో స్థానికుల మనోభావాల గురించి వారికి తెలియక ఇలా చేసారని, మన్నించమని కోరారు.
భవిష్యత్తులో ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను.అని టెంట్ హౌస్ యజమాని చెప్పడంతో కథ ముగిసింది.







