ఎవరి టాలెంట్ వారిది.‘కవితకు కాదేది అనర్హం’ అన్నట్టు వ్యవరిస్తుంటారు మనలో కొంతమంది.అందరూ ఒక దారిలో వెళితే, వారు మరొక దారిలో వెళ్తూ, అందరిని ఆశ్చర్య పరుస్తూ వుంటారు.అలాగే వారు ఎంచుకున్న కెరీర్లో మంచి విజయాలు సాధిస్తూ వుంటారు.
తాజాగా దాన్ని రుజువు చేసాడొక పండ్ల వ్యాపారి.అవును.
పండ్లు అమ్మడం కూడా ఓ కళే.అందరూ కస్టమర్లను ఆకట్టుకోలేరు.కొంతమంది వాటిని అమ్మే క్రమంలో కొన్ని రకాల జిమ్ముక్కులు ఉపయోగిస్తూ వుంటారు.వాటిని తీసుకోవాల్సిందేనని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపిస్తుంటారు.
ఇది వారికి తెలిసిన మార్కెటింగ్ స్ట్రేటజీ.
బేసిగ్గా చదువుకున్న మార్కెటింగ్ చేసే వారు సూటు.
బూటు వేసుకొని కస్టమర్లను ఆకట్టుకొనే మాటలు చెప్పి, బిజినెస్ చేసుకోవడం మనం చూసాం.కానీ ఇక్కడ వీడియోలో కనబడిన అతను కనీసం ఒకటో తరగతి కూడా చదువుకొని ఉండదు.
పండ్లు అమ్మడం కోసం తాను పడుతున్న తాపత్రయం చూస్తే ఔరా అనిపించక మానదు.తానొక ప్లాట్ ఫామ్ బండిపై వాటర్ మిలన్, పాపాయ అమ్ముతున్నాడు.
వాటిని విక్రయించేందుకు వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు.వాటిని అందంగా కత్తిరించి చూపించాడు.
అక్కడితో ఆగకుండా పెద్దగా కేకలు వేస్తూ వాటిని వర్ణిస్తున్నాడు.

ఇక తాను అమ్ముతున్న విధానాన్ని ఓ వీడియో తీసి రెడిట్‌లో అప్‌లోడ్ చేశాడు.దాంతో ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది.ఆ పళ్లను కత్తిరించే సమయంలో అతని హవభావాలుని చూసి నెటిజన్లు తెగ ముచ్చట పడుతున్నారు.ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది.ఇప్పటికే 65 వేల మంది లైక్ చేశారు.వీడియోను చూసి చాలా మంది ఎంజాయ్ చేశారు.క్రోగర్ కంపెనీ ప్రచారం కోసం చూస్తుందని.
దానికి ఇతను సరిపోతడాని మరొకరు సూచించారు.అరిచిన సమయంలో హవభావాలు బాగున్నాయని మరొకరు కామెంట్ చేశారు.
ఇలా చాలా మంది కామెంట్స్ చేశారు.







