మనుషులు-జంతువులకు మధ్య ఎంతో మంచి బాండింగ్, ప్రేమ ఉంటుంది.కొందరు జంతు ప్రేమికులు తమ పెంపుడు జంతువులను చిన్న పిల్లల్లా ట్రీట్ చేస్తుంటారు.
ఆ జంతువులు కూడా తమ యజమానులతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు.వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి.
ఇలాంటి వీడియోలు చూసినప్పుడు నెటిజన్లు తమ ఫోన్లకు అతుక్కొని పోతుంటారు.ఇలాంటి మధురమైన వీడియోలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
మనుషులు-జంతువుల ప్రేమానురాగాలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.యోగ్ అనే వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్‌లో ఓ వీడియోను షేర్ చేశారు.
ఈ వీడియోను మనం చూసినట్లయితే.ఓ చిన్నారి తన పెంపుడు పిల్లికి ట్రైనింగ్ ఇవ్వాలని అనుకుంటుంది.
లావుగా ఉన్న పిల్లికి ఎక్సర్‌సైజ్ ముఖ్యమని భావించి ఉంటుంది.అందుకే ట్రెడ్‌మిల్ ఆన్ చేసి వాకింగ్ ఎలా చేయాలో ట్రైనింగ్ ఇస్తుంది.
చిన్నారి పిల్లికి నేర్పించడానికి రెండు, మూడు సార్లు ట్రెడ్‌మిల్‌పై వాకింగ్ చేస్తుంది.ట్రెడ్‌మిల్‌పై వాకింగ్ చేసిన చిన్నారిని చూసి పిల్లి కూడా కొంచెం సేపటి తర్వాత నడుస్తుంది.
యోగ్ అప్లోడ్ చేసిన ఈ వీడియోకు ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు.‘ట్రెడ్‌మిల్‌పై పిల్లికి ట్రైనింగ్ ఇస్తున్న చిన్నారి.’ అని రాసుకొచ్చారు.49 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటివరకు 1.5 మిలియన్ల వ్యూవ్స్ వచ్చాయి.13.3కే మంది రీట్విట్ చేయగా.90కే మంది లైక్స్ వచ్చాయి.అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.‘పిల్లినే చిన్నారికి ట్రెడ్‌మిల్ నేర్పిస్తోంది.’ అని పేర్కొంటున్నారు.‘చిన్నారి ఇచ్చిన ట్రైనింగ్‌కి పిల్లి రియాక్ట్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేయలేదు.
పిల్లి ఎంతో గొప్పగా చేసింది.’ అని మరో నెటిజన్ పేర్కొన్నారు.
‘చిన్న పిల్లలు-జంతువుల మధ్య బాండింగ్ ఎంతో స్వచ్ఛమైనది.’ అని చెబుతున్నారు.