మనం ప్రతి రోజూ వాడే గ్యాడ్జెట్‌లలో ఎక్కువగా పేలిపోయే వాటిలో మొబైల్ ఫోన్ ముందుంటుంది.మొబైల్ ఫోన్లలోని బ్యాటరీలు డ్యామేజ్ కావడమో లేదా బాగా హీట్ ఎక్కడమో కారణంగా ఫోన్లు పేలిపోతుంటాయి.
ఇలాంటి ఉదంతాలు ఇప్పటికే ఎన్నో వెలుగు చూశాయి.ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారూ ఉన్నారు.
అయితే కొందరు మాత్రం సమయస్ఫూర్తితో ఫోన్ బ్లాస్ట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
ఒక వ్యక్తి మొబైల్ రిపేర్ చేస్తుండగా.అది ఒక్క సారిగా పేలిపోయింది.
అందులోనుంచి ఎగసిపడుతున్న మంటలు సదరు వ్యక్తిని ప్రాణ భయంతో వణికేలా చేశాయంటే అతిశయోక్తి కాదు.అయితే అతడు చాకచక్యంగా మొబైల్ ఫోన్ పట్టుకుని తనకి కాస్త దూరంగా విసిరేశాడు.
అప్పటికీ ఆ ఫోన్ నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి.క్షణాల్లోనే మొబైల్ రిపేరు చేసే వ్యక్తి స్పందించడంతో ఈ ఘటనలో ఎవరూ కూడా గాయాల పాలు కాలేదు.
ఈ తతంగమంతా మొబైల్ రిపేరింగ్ షాప్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.అయితే ఈ వీడియోని ఒక యూట్యూబ్ ఛానల్ షేర్ చేసింది.నవంబర్ 5న వియత్నంలోని థాయ్ గుయెన్‌లోని ఓ మొబైల్ రిపేరింగ్ షాపులో సెల్ ఫోన్ బ్యాటరీ పేలినట్లు యూట్యూబ్ ఛానల్ తెలిపింది.కాగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.
వైరల్ అయిన వీడియోలో ఒక వ్యక్తి మొబైల్ రిపేర్ చేస్తుండడం చూడొచ్చు.మొబైల్ బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం చూడొచ్చు.
ఆ మంటలు అతనివైపు కాకుండా ముందువైపు కూడా దూసుకెళ్లడం గమనించవచ్చు.దాంతో అతడికి మంట సెగ తాకలేదు.
ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలి మంట చెలరేగడంతో అతడు వెనక్కి వెళ్లి.క్షణాల్లోనే ఆ ఫోన్ ని బయటకు విసిరేయడం కూడా ఈ వీడియోలో కనిపించింది.దాంతో పెద్ద ప్రమాదమే తప్పింది.ఫోన్ బ్లాస్ట్ ఘటనలు ఎక్కువగా జరుగుతున్న వేళ నిపుణులు యూజర్లను హెచ్చరిస్తున్నారు.
ఫోన్ బ్యాటరీ ఉబ్బినా.బాగా హీటెక్కినా.
ఛార్జింగ్ పెట్టి కాల్ మాట్లాడుతున్నా.గేమ్స్ ఆడుతున్నా.
ఫోన్ బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.