విజయం బి‌ఆర్‌ఎస్ దేనా.. నో డౌట్ ?

తెలంగాణలో ఎన్నికలకు ఎంతో సమయం లేదు.సరిగ్గా అయిదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో పార్టీల గెలుపోటములపై చర్చ జరుగుతోంది.వచ్చే ఎన్నికల్లో విజయం మాదంటే మాదంటూ ప్రధాన పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

దాంతో ఎలాంటి సర్వేలు బయటకు వచ్చిన.చర్చనీయాంశంగా నిలుస్తున్నాయి.

ఇప్పటివరకు తెలంగాణ విషయంలో వచ్చిన సర్వేలన్నీ దాదాపుగా అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకే అనుకూలంగా నిలిచాయి.దాంతో వచ్చే ఎన్నికలతో హ్యాట్రిక్ విజయం నమోదు చేస్తామని బి‌ఆర్‌ఎస్( BRS party ) కాన్ఫిడెంట్ గా ఉంది.

Advertisement

అయితే కాంగ్రెస్, బిజెపి వంటి పార్టీలు నిర్వహించిన సర్వేలలో బి‌ఆర్‌ఎస్ కు ఓటమి తప్పదనే విధంగా ఫలితాలు వస్తున్నాయి.

ఓవరాల్ గా చూస్తే ఈసారి కూడా బి‌ఆర్‌ఎస్ కే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ అని అటు విశ్లేషకులు సైతం వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.తాజాగా గెలుపు విషయంలో మంత్రి హరీష్ రావు కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు.ప్రత్యర్థి పార్టీలు ఏవేవో కలలు కంటున్నాయని, అవన్నీ పగటి కలలే తప్పా నెరవేరే పరిస్థితి లేదని, వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు బి‌ఆర్‌ఎస్ కు అధికారం కట్టబెట్టేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.

తాము నిర్వహించిన సర్వేలలో ఈ విషయం వెల్లడైందని హరీష్ రావు( Harish Rao ) చెప్పుకొచ్చారు.

కే‌సి‌ఆర్( CM KCR ) అందిస్తున్న సుపరిపాలన పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని, నో డౌట్ వచ్చే ఎన్నికల్లో కూడా బి‌ఆర్‌ఎస్ విజయం తథ్యం అంటూ కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు.అయితే విన్నింగ్ వీషయాన్ని పక్కన పెడితే ఆ పార్టీ గెలిచే సీట్లపైనే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.2014 లో 63 సీట్లు, 2018 లో 88 సీట్లు గెలుచుకున్న బి‌ఆర్‌ఎస్.ఈసారి ఎన్ని సీట్లలో సత్తా చాటనుందనేది ఆసక్తికరంగా మారింది.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?

ఈసారి 100కు పైగా సీట్లు సొంతం చేసుకుంటామని బి‌ఆర్‌ఎస్ నేతలు చెబుతున్నప్పటికి.ఆ స్థాయి సీట్లు రావనేది కొందరి అభిప్రాయం.

Advertisement

ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుంచి గట్టి పోటీ ఎదుర్కొనే అవకాశం ఉంది.మరి గెలుపు విషయంలో ధీమాగా ఉన్న బి‌ఆర్‌ఎస్.

సీట్ల విషయంలోనే కొంత ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు