బాలీవుడ్ క్యూట్ కపుల్ విక్కీ కౌశల్,కత్రినా కైఫ్ ( Vicky kaushal katrina kaif )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు.కాగా ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.2021లో అనగా కరోనా మహమ్మారి అప్పుడప్పుడు తగ్గుముఖం పడుతున్న సమయంలో కొద్ది మంది సన్నిహితులు స్నేహితుల సమక్షంలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది.ఇకపోతే ప్రస్తుతం వీరిద్దరు ఎవరికివారు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.అలాగే పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ భారీగా సంపాదిస్తున్నారు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్.

ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్కీ కౌశల్ ( Vicky kaushal )పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇద్దరి మధ్య గొడవలు వస్తే వాటిని ఎలా పరిష్కరించుకుంటారో అన్న విషయం గురించి తెలిపాడు.మా ఇద్దరి మధ్య గొడవ వచ్చిన సమయంలో ముందుగా నేనే సారీ ( Sorry )చెబుతాను.తప్పు తనది అయినా నాది అయినా ముందుగా నేను క్షమాపణ చెబుతాను.
గొడవని అక్కడితో ఎండ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను అని చెప్పుకొచ్చారు విక్కీ కౌశల్.ఒక బంధంలో ఎవరైనా ఎందుకు గొడవ కావాలని అనుకుంటారు.
అందుకనే దానిని ఎండ్ చేయడానికి చూడడం బెటర్ అంటూ కపుల్స్ కి సలహా ఇచ్చాడు.

ఇకపోతే ఈ జంట సినిమాల విషయానికొస్తే. విక్కీ కౌశల్ ప్రస్తుతం ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ( The Great Indian Family ), సామ్ బహుదూర్ సినిమాల్లో హీరోగా నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ పూర్తి అవ్వడంతో అవి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి.
మరోవైపు కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్ ( Salman Khan )హీరోగా నటించిన టైగర్ 3 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.