ఒకప్పుడు దేశం గర్వించదగ్గ సినిమాలు తీసిన రాంగోపాల్ వర్మ( Ramgopal Verma ) గత కొన్ని సంవత్సరాలుగా తన ప్రతిష్ట పూర్తిగా మసక బారే సినిమాలు తీస్తూ తన అభిమానులను తీవ్రంగా నీరుత్సాహపరిచారు .మొన్నటి వరకూ స్త్రీ శరీరాన్ని ఆబ్జెక్టివ్ఫై చేసే సినిమాలు తీసిన ఆయన ఇప్పుడు డిమాండ్ ఉండడం తో రాజకీయ( political ) సినిమాల వైపు దృష్టి సారించారు .
రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన ప్రభావం చూపిన కొంతమంది జీవిత చరిత్రలు తీసిన వర్మ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కేంద్రంగా వ్యూహం, శపధం అనే సినిమాలు తీస్తున్నారు.ఇప్పటికే ప్రతిపక్ష చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసిన వర్మ ఇప్పుడు వ్యూహంలో కూడా చంద్రబాబు( Chandrababu ) ను విలన్ గానే చూపిస్తున్నట్టు రిలీజయిన ట్రైలర్ను చూస్తే అర్థమవుతుంది.
ఇటీవల సంచలనం కలిగించిన స్కిల్ స్కామ్ కేసును కూడా తన ట్రైలర్ లో చూపించిన వర్మ ఉద్దేశపూర్వకంగానే తెలుగుదేశం పార్టీ కి వ్యతిరేకంగా సినిమా తీస్తున్నట్లుగా తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

నవంబర్ 10వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుందని ముందుగా ప్రచారం జరిగింది.అయితే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి సెన్సార్ బోర్డుకి రాసిన లేఖ తో ఈ సినిమా విడుదల నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది.ప్రస్తుతం కోర్టులలో ఉన్న వ్యవహారాల గురించి ఈ సినిమాలో ప్రస్తావన ఉందని, తనను ,తన తండ్రిని అసభ్యంగా చిత్రీకరించే విధంగా ఈ సినిమా ట్రైలర్ ఉండటంవల్ల తన పరువు కు నష్టం కలిగించే విధంగా ఈ సినిమా ఉందంటూ, ఆ సినిమా విడుదల అడ్డుకోవాలని ఆయన లేఖ రాశారు.
దాంతో సెన్సార్ బోర్డు( Sensor board ) ఈ సినిమాను నిలుపుదల చేసింది .

దాంతో వర్మ మరింత అగ్రెసివ్ గా లోకేష్ ను టార్గెట్ చేస్తున్నారు.నేను నా వ్యూహంతో నీ కెరీర్ ను కెలకాలని రాలేదని, నా వ్యూహంతో నీ వ్యూహాన్ని బట్ట బయలు చేయాలని వచ్చానని , తగ్గేదే లేదంటూ పుష్ప స్టైల్ లో ఆయన స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నారు.అయితే నిబంధనలకు విరుద్ధంగా ఉందన్న కారణంతో వ్యూహం( vyuham ) థియేటర్ రిలీజ్ ను అడ్డుకున్నప్పటికీ ఓటీటీ చానల్లోనైనా రిలీజ్ చేయాలనే ఆలోచనలో రామ్ గోపాల్ వర్మ ఉన్నట్లుగా తెలుస్తుంది .ఇప్పటికే ఈ సినిమా జగన్కు అనుకూలంగా ఉందని ప్రచారం జరుగుతూ ఉండటం, ఈ సినిమా నిర్మాత కూడా వైసిపి చెందిన వ్యక్తి కావడంతో వైసీపీ తెరవెనక మద్దతు కూడా వర్మకు అందే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది .మరి వర్మ vs లోకేష్ ఎపిసోడ్ లో ఎవరిది పై చెయ్యి అవుతుందో వేచి చూడాలి .