ఆ సినిమా వల్ల ఏడేళ్లు ఖాళీగా ఉన్నా : వేణు శ్రీరామ్

దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఓ మై ఫ్రెండ్ సినిమా ద్వారా తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమయ్యారు వేణు శ్రీరామ్.సిద్దార్థ్ హీరోగా నవదీప్ కీలక పాత్రలో నటించిన ఆ సినిమాకు టాక్ బాగానే వచ్చినా సినిమా మాత్రం కమర్షియల్ గా హిట్ కాలేదు.

2011 సంవత్సరంలో ఈ సినిమా విడుదల కాగా ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఏడు సంవత్సరాలు తాను ఇంటికే పరిమితమయ్యానంటూ వేణు శ్రీరామ్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.పవన్ సినిమాకు డైరెక్షన్ చేసే ఛాన్స్ రావడం తన లక్ అని.తనకు ఎంతో ఇష్టమైన హీరో పవన్ అని వేణు శ్రీరామ్ పేర్కొన్నారు.వకీల్ సాబ్ సినిమా డైరెక్షన్ చేసే సమయంలో తాను ఒత్తిడికి లోను కాలేదని.

నచ్చిన హీరో సినిమాకు డైరెక్షన్ చేస్తున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని వేణు శ్రీరామ్ తెలిపారు.వకీల్ సాబ్ సినిమా తనకెంతో స్పెషల్ అని.మహిళా సాధికారత కాన్సెప్ట్ తోనే వకీల్ సాబ్ సినిమాను తెరకెక్కిస్తున్నామని వేణు శ్రీరామ్ పేర్కొన్నారు.

తొలి సినిమా ఓ మై ఫ్రెండ్ స్నేహం ప్రధానంగా తెరకెక్కిస్తే అనుకున్న స్థాయిలో ఆడలేదని ఆ తరువాత ఎంసీఏ సినిమా తెరకెక్కించగా మూడో సినిమాగా వకీల్ సాబ్ సినిమాను తెరకెక్కించానని సినిమాపై ఉన్న ఇష్టం వల్లే ఇండస్ట్రీలో తాను రాణిస్తున్నానని వేణు శ్రీరామ్ పేర్కొన్నారు.తొలి సినిమాకే తాను బెస్ట్ ఫెయిల్యూర్ ను చూశానని పవన్ తో సినిమా చేయడం తన డ్రీమ్ అని వేణు శ్రీరామ్ వెల్లడించారు.ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని.

Advertisement

ట్రైలర్ లో చూపించిన సీన్స్ ను కోర్టులోనే చిత్రీకరించామని వేణు శ్రీరామ్ అన్నారు.వకీల్ సాబ్ సినిమాను ప్రకటించిన సమయంలో తనపై కొన్ని ట్రోల్స్ వచ్చాయని.

ఐకాన్ సినిమా ఉంటుందని వకీల్ సాబ్ సినిమా విడుదలైన తరువాత తదుపరి ప్రాజెక్టులకు సంబంధించి వెల్లడిస్తానని వేణు శ్రీరామ్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు