టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరో విక్టరీ వెంకటేష్( Victory Venkatesh ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.వెంకటేష్ తెలుగులో ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.
ముఖ్యంగా ఫ్యామిలీ హీరో( Family Hero )గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ని ఏర్పరుచుకున్నాడు వెంకటేష్.హీరోగా మెప్పించడంతో పాటు తన కామెడీతో కూడా ప్రేక్షకులను మెప్పించగల హీరో వెంకటేష్.30 ఏళ్లుగా కష్టపడి మంచి గుర్తింపును సంపాదించుకున్న వెంకటేష్ ఒకే ఒక్క వెబ్ సిరీస్ తో చల్లా మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అయింది.

హీరో రానా దగ్గుబాటి( Rana Daggubati ) వెంకటేష్ కలిసిన నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు.ఈ వెబ్ సిరీస్ తో అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు.వెంకటేష్ ఇలాంటి వెబ్ సిరీస్ లో నటిస్తాడని అభిమానులు ఊహించలేకపోయారు.
ఈ వెబ్ సిరీస్ విడుదల అయిన తర్వాత ఏ రేంజ్ లో ట్రోలింగ్స్( Trollings ) నెగిటివ్ కామెంట్స్ వినిపించాయో మనందరికీ తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి వెంకటేష్ స్పందించాడు.
అభిరామ్ దగ్గుపాటి హీరోగా నటించిన తాజా చిత్రం అహింస.

ఈ సినిమా ప్రెస్ మీట్ లో రానా నాయుడు వెబ్ సిరీస్( Rana Naidu Webseries ) లో అభ్యంతరకర సన్నివేశాల గురించి ప్రశ్నించారు.ఆ ప్రశ్నల పై స్పందించిన వెంకటేష్.రానానాయుడు వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
అయితే బోల్డ్ సీన్స్( Bold Scenes ) గురించి ఆలోచిస్తూ ఉండడం కంటే ముందుకు వెళ్లడమే మంచిది.ఫస్ట్ సీజన్ లో కొన్ని సీన్స్ ప్రభావం చూపించిన మాట వాస్తవమే.
నెక్స్ట్ సీజన్ మాత్రం అందరికి నచ్చే విధంగానే ఉంటుంది మొదటి సీజన్ కంటే రెండవ సీజన్ కి ఆడియన్స్ పెరుగుతారు అని తెలిపారు వెంకటేష్.మరి రెండవ సీజన్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.