చిత్ర పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలకు వారి ప్రతిభ ఆధారంగా ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను ప్రకటిస్తూ వారిని గౌరవిస్తూ ఉంటారు ఇలా ఎన్నో అవార్డులు ఉండగా ప్రభుత్వం నుంచి అందుకునే నంది అవార్డులకు(Nandi Awards) ఎంతో ప్రత్యేకమైన గౌరవం ఉందని చెప్పాలి.ఇలా ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం (State Government) నటీనటుల ప్రతిభ ఆధారంగా వారికి నంది అవార్డులను ప్రదానం చేసేవారు అయితే కొన్ని సంవత్సరాలుగా సెలబ్రిటీలకు నంది అవార్డులను ప్రకటించడం లేదు అన్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే నంది అవార్డుల ప్రధానోత్సవం గురించి ఇది వారికి ఎంతో మంది సెలబ్రిటీలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

కళాకారులను గౌరవిస్తూ వారికి ప్రోత్సాహంగా ఇచ్చే నంది అవార్డులను ఇవ్వకపోవడం చాలా విడ్డూరమని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నంది అవార్డులపై మరోసారి పునరాలోచన చేసి ఈ అవార్డులను ప్రకటించాలంటూ ఇదివరకే ఎంతో మంది నిర్మాతలు నంది అవార్డుల గురించి కామెంట్లు చేసిన విషయం మనకు తెలిసింద.అయితే తాజాగా సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్(Venkatesh) సైతం నంది అవార్డుల గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా వెంకటేష్ నంది అవార్డుల గురించి మాట్లాడుతూ… నేను ఎప్పుడూ కూడా అవార్డుల గురించి ఆలోచించను.ప్రభుత్వం ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు కానీ అవార్డులు మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయని ఈ సందర్భంగా వెంకటేష్ నంది అవార్డుల గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక వెంకటేష్ సినిమాల విషయానికి వస్తే ఈయన సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
తాజాగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తో కలిసి కిసీ కా బాయ్ కీసీ కీ జాన్ అనే సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే.ఇక ప్రస్తుతం ఈయన సైంధవ్ (Saindhav) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.







