మిస్ వరల్డ్‌ను మిస్ చేసుకున్న వెంకటేష్

విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లను చిత్రసీమకు పరిచయం చేశాడు.

గతంలో ఆయనతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు ఇప్పుడు స్టార్ బ్యూటీలుగా ఇండస్ట్రీలో ఉన్నారు.

అయితే వెంకీ ఒక సందర్భంలో మిస్ వరల్డ్‌తో సినిమా చేయాల్సిన అవకాశాన్ని చేజార్చుకున్నాడు.వెంకీ కెరీర్‌లో సూపర్ హిట్ మూవీగా నిలిచి, ఆయన హిట్ చిత్రాల లిస్టులో ప్రత్యేకంగా నిలిచిన చిత్రం ప్రేమించుకుందాం రా. ఈ సినిమా అప్పట్లో యూత్‌ను ఏ విధంగా ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఈ సినిమా రొమాంటిక్ చిత్రాలకు సరికొత్త ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.

ఇక ఈ సినిమాలో వెంకీ సరసన అంజలా జవేరీ హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.అయితే ఈ సినిమాలో తొలుత ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్‌ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించారట.

కానీ ఆ సమయంలో ఆమె ఫాంలో లేకపోవడంతో చిత్ర యూనిట్ ఆమెను పక్కనబెట్టారట.దీంతో ఆ అవకాశం అంజలా జవేరీకి దక్కడంతో ఆమె ఆ సినిమాలో నటించింది.

Advertisement

ఇక ఆ సినిమా తరువాత వరుసగ స్టార్ హీరోల పక్కన నటించింది ఈ బ్యూటీ.మొత్తానికి మిస్ వరల్డ్‌తో రొమాన్స్ చేసే అవకాశం వెంకీ మామ మిస్ చేసుకున్నాడు.

ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను.. సోనమ్ కపూర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Advertisement

తాజా వార్తలు