వెంకటేష్ చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానించే హీరో గా పేరు దక్కించుకున్నాడు.ఆయన సినిమాలు ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే అన్నట్లుగా ఉండేవి.
మహిళలలో ఎక్కువగా ఆదరణ సొంతం చేసుకున్న వెంకటేష్, ఈ మధ్య కాలంలో కాస్త సినిమాల సంఖ్య తగ్గించాడు.మొన్నటి వరకు కూడా ఆయన సినిమాలంటే ఆడ వారు క్యూ కట్టి మరి చూసేవారు.
అలాంటి వెంకటేష్ నుండి వస్తున్న బూతు డైలాగ్స్ విని లేడీస్ ముక్కున వేలేసుకుంటూ ఉన్నారు.అసలు విషయం ఏంటంటే రానా తో కలిసి వెంకటేష్ ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే.
ఆ వెబ్ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.వచ్చే నెలలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ లో వెంకటేష్ వాడిన బూతులు మరియు రానా చేసిన రొమాన్స్ వైరల్ అవుతున్నాయి.

వెంకటేష్ నుండి ఇలాంటి బూతులు వింటామని ఎప్పుడు ఊహించలేదని కొందరు మహిళ ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటే.యూత్ ఆడియన్స్ మాత్రం ఈ రోజుల్లో ఇలాంటివన్నీ కామనే కదా, వెంకటేష్ ట్రెండ్ కు తగ్గట్లుగా నటిస్తున్నాడు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి వెంకటేష్ యొక్క రానా నాయుడు బూతులు అన్ని వర్గాల వారిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.వేరే హీరోలు లేదా నటీనటులు ఇలాంటి మాటలు మాట్లాడితే పరవాలేదు కానీ వెంకటేష్ వంటి సీనియర్ హీరో అది కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా అభిమానించే హీరో ఇలాంటి మాటలు మాట్లాడటాన్ని జీర్ణించుకోలేక పోతున్నామంటూ చాలా మంది చాలా రకాలుగా వెబ్ సిరీస్ పై కామెంట్ చేస్తున్నారు.
ట్రైలర్ లోనే ఇలా ఉంటే మొత్తం సిరీస్ లో వెంకటేష్ యొక్క బూతులు ఏ స్థాయిలో ఉంటాయో అనే ఆందోళన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.