సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్( Victory Venkatesh ) ప్రస్తుతం తన కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీ చేసి రిలీజ్ కు రెడీగా ఉంచిన విషయం తెలిసిందే.తన కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ 75వ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.
మరి వెంకటేష్ నటుడిగా 75 సినిమాలను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నిన్న గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంట్ కు ఎంతో మంది ప్రముఖ సినీ నటులు హాజరయ్యారు.
ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు.ఈ వేదికపై వెంకటేష్ తన స్పీచ్ తో అదరగొట్టారు.
వెంకీ మామ తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు.మెగాస్టార్ చిరంజీవి గారు లేకుండా సినిమాలు మానేసి ఎప్పుడో హిమాలయాలకు వెళ్లి ఉండే వాడినంటూ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
9 ఏళ్ల విరామం తర్వాత తిరిగి వచ్చి ఖైదీ 150 సినిమాతో బ్లాక్ బస్టర్ అందించడం చూసి ఈ నటన కొనసాగించాలని తెలుసుకున్నాను.అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.అంతేకాదు ఈ వేదికపై చిరు డైలాగ్ వెంకీ అలాగే వెంకీ డైలాగ్ చిరు చెప్పి అందరిని ఆకట్టుకున్నారు.
ఇక వెంకటేష్ హీరోగా యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ”సైంధవ్”( Saindhav ).ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కు సిద్ధం చేసారు.కాగా ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తుండగా.
సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఒక వెంకీకి జోడీగా శ్రద్ధ శ్రీనాథ్ ( Shraddha Srinath ) నటిస్తుండగా.
ఆండ్రియా, రుహనీ శర్మ కూడా కీ రోల్స్ పోషిస్తున్నారు.