ఈ మధ్య కాలం లో హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎంతో మంది స్టార్స్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.
వారి దారి లో టాలీవుడ్ హీరో లు కూడా కొందరు వెబ్ సిరీస్ లు చేయడం జరిగింది.అందులో నాగ చైతన్య మరియు వెంకటేష్ లు ఉన్నారు.
రానా నాయుడు సిరీస్ తో వెంకటేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ వెబ్ సిరీస్ ఫలితం ఏంటో అందరికి తెల్సిందే.
ఇక నాగ చైతన్య కూడా ఇటీవల దూత సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.రానా నాయుడు తో పోల్చితే దూత కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఉందనే టాక్ వచ్చింది.
కాని ఓవరాల్ గా మాత్రం ఫలితం అంత ఆశాజనకంగా లేదని చెప్పాలి.హీరో గా నాగ చైతన్య సినిమా లు ఎన్ని చేసినా కూడా మినిమం గ్యారెంటీ అన్నట్లుగా వసూళ్లు నమోదు అవ్వడం మనం చూస్తూ ఉంటాం.
కానీ ఈ వెబ్ సిరీస్ కి మాత్రం అలాంటి కలెక్షన్స్ రాలేదని చెప్పాలి.దూత సిరీస్ కి ప్రముఖ దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించాడు.
ఆయన దర్శకత్వం లో వచ్చిన హర్రర్ సినిమా లు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.అందుకే ఈ సిరీస్ పై కొందరు చాలా ఆశలు పెట్టుకున్నారు.కానీ సిరీస్ నిరాశే మిగిల్చింది అంటూ వారు స్వయంగా కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి మామ రానా నాయుడు సిరీస్ తో డిజిటల్ ప్లాట్ ఫామ్ పై బొక్క బోర్లా పడితే ఇప్పుడు అల్లుడు నాగ చైతన్య కూడా దూత సిరీస్ తో నిరాశ పరిచాడు.
ఈ ఇద్దరు హీరోల కు వచ్చిన ఫలితాల నేపథ్యం లో ముందు ముందు ఇతర హీరోలు ఓటీటీ కంటెంట్ పై ఆసక్తి కనబర్చే అవకాశాలు ఉండకపోవచ్చు అంటున్నారు.