ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ రాష్ట్రంలో నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.విద్యా మరియు వైద్యరంగంలో జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు ఇతర రాష్ట్రాలు తమ రాష్ట్రంలో కూడా ప్రారంభించడానికి ముందుకు వస్తున్నాయి.
కేంద్ర పెద్దలు కూడా పలు కార్యక్రమాలను అభినందించడం జరిగింది.స్వయంగా రాష్ట్రంలో పర్యటించి ఆయా కార్యక్రమాల పనితీరు పట్ల కూడా కేంద్ర బృందం ప్రశంసలు వర్షం కురిపించిన సందర్భాలు ఉన్నాయి.
ఈ క్రమంలో తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో నిర్వహిస్తున్న “గడపగడపకు మన ప్రభుత్వం” పై ప్రశంసల వర్షం కురిపించారు.
నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన వెంకయ్య నాయుడు.
“గడపగడపకు మన ప్రభుత్వం” తో నేతలు అంతా ప్రతి ఇంటికి వెళ్తున్నారు. ప్రభుత్వం అందించే పథకాలు కింది స్థాయి దాకా అందుతున్నాయా లేదా అనేది తెలుసుకునే విధంగా జరుగుతున్న ఈ కార్యక్రమం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఎన్నికలప్పుడే కాదు…మిగతా రోజుల్లోనూ ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలి.ఏ ప్రభుత్వంలోనైనా చెప్పింది చివరి వరకు చేరిందా అనేది తెలుసుకోవాలి.
లేకపోతే వచ్చేలా చూడాలి.అని వెంకయ్య నాయుడు తెలియజేశారు.







