శాకాహారులకి ఉన్న పెద్ద ప్రమాదం ఇదే

ఒంట్లో ఐరన్ కంటెంట్ సరిగా లేకపోతే రక్తలేమి సమస్య వస్తుంది.ఈ సమస్య వస్తే ఎన్ని సమస్యలో చెప్పాల్సిన పని లేదు.

ఈ రక్తహీనత సమస్యనే అనేమియా అని అంటారు.మహిళల్లో ఎక్కువగా కనబడే సమస్య ఇది.59% స్త్రీలలో ఈ సమస్య ఉంటుందట.గర్భిణీలు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారట.21% పిల్లల్లో కూడా రక్తహీనత చూడొచ్చు.ఇక ఎవరైనా సరే, కూరగాయల మీద ఆధారపడే శాకహారులు కూడా ఈ సమస్య వలన ఇబ్బంది పడొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.

చాలావరకు వెజిటబుల్స్ లో ఫైటేట్స్ ఉంటాయి.ఇవి ఐరన్ ని మన శరీరం అబ్జర్వ్స్ చేసుకోకుండా అడ్డుకుంటాయని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు.మరి ఈ సమస్యకి పరిష్కారం లేదా అంటే ఉంది.

శాకహారులు వెజిటబుల్స్ తోపాటు విటమిన్ సి ఉన్న పండ్లు, కూరగాయలు తీసుకుంటే ఐరన్ శరీరంలో బాగా చేరుతుంది అంట.హైదరాబాద్ కి చెందిన ప్రముఖ న్యూట్రిషన్ ఫాతిమా తాహేర్ అలీ ఈ విషయం మీద మాట్లాడుతూ " మేము చాలారోజులుగా చెబుతున్నాం.వెజిటబుల్స్ లో ఉండే ఐరన్ ని శరీరం బాగా ఉపయోగించుకోవాలంటే విటమిన్ సి కంటెంట్ ఉన్న పండ్లు, కూరగాయలు కూడా తీసుకోవాలి.

Advertisement

అప్పుడే రక్తం బాగా పుడుతుంది " అని చెప్పారు.పెద్దగా ప్రచారం పొందని సమస్య అయినా, సీరియస్ గా తీసుకోవాల్సిన సమస్య ఇది.కాబట్టి ఐరన్ ఉన్న అహారం, దాంతోపాటు విటమిన్ సి ఉన్న ఆహారంతో డైట్ బాగా ప్లాన్ చేసుకోండి.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు