నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది.వీరసింహారెడ్డి మూవీ ఈరోజు థియేటర్లలో విడుదలైంది.
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సానుకూలంగా వ్యవహరించడంతో ఎర్లీ మార్నింగ్ నుంచి వీరసింహారెడ్డి షోలు ప్రదర్శితం అవుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వీరసింహారెడ్డి మూవీ కటౌట్లు కనిపిస్తున్నాయి.
వీరసింహారెడ్డి సినిమాకు టాక్ కూడా పాజిటివ్ గా ఉండటం గమనార్హం.
ఓవర్సీస్ నుంచి అందుతున్న రిపోర్ట్ ప్రకారం అఖండ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్న బాలయ్య వీరసింహారెడ్డితో మరోసారి ఫ్యాన్స్ ను మెప్పించారు.
బాలయ్య సినిమా అంటే సాధారణంగా ఎలా ఉంటే ఫ్యాన్స్ కు నచ్చుతుందో ఈ సినిమా అదే విధంగా ఉందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి.
అఖండ సక్సెస్ ఇచ్చిన ఊపులో ప్రతి సన్నివేశంలో బాలయ్య మరింత ఎనర్జీతో కనిపించారు.సినిమా నిడివి కొంచెం ఎక్కువే అయినా బాలయ్య ఫ్యాన్స్ ను గోపీచంద్ మలినేని మాత్రం అస్సలు నిరాశపరచలేదు.క్రాక్ తో హిట్ సాధించిన గోపీచంద్ మలినేని అన్ని విషయాల్లోనూ ఆ సినిమాను మించేలా ఈ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు.శృతి హాసన్, హనీ రోజ్ లకు కీలక పాత్రలు దక్కాయి.
ఇంటర్వెల్ ట్విస్ట్ అంచనాలకు భిన్నంగా ఉండగా క్లైమాక్స్ సన్నివేశాల్లో బాలయ్య జోరు చూస్తే ఫ్యాన్స్ కు కూడా పూనకాలు వచ్చేస్తాయి.కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నా బాలయ్య తన నటనతో వాటి విషయంలో ప్రేక్షకుల అభిప్రాయాలను మార్చేశారు.వీరసింహారెడ్డి బాలయ్య కెరీర్ లోని బెస్ట్ సినిమాలలో ఒకటని చెప్పవచ్చు.సెకండాఫ్ తో పోల్చి చూస్తే ఫస్టాఫ్ హైలెట్ గా ఉండటం కొసమెరుపు.సెకండాఫ్ విషయంలో గోపీచంద్ మలినేని ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.