బాలయ్య హీరోయిన్‌ సన్నబడింది.. మన స్టార్‌ హీరోల చూపు పడేనా?

నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) హీరో గా నటించిన వీర సింహారెడ్డి( Veerasimha Reddy ) చిత్రం లో సెకండ్ హీరోయిన్ గా నటించిన మలయాళీ బ్యూటీ హనీ రోజ్‌( Honey Rose ) బొద్దుగా అందంగా ఉందంటూ తెలుగు అభిమానులు కూడా ఫిదా అయ్యారు.బాలకృష్ణ మరోసారి ఈమె తో నటించాలని కోరుకుంటున్నాడని ప్రచారం జరిగింది.

 Veerasimha Reddy Heroine Honey Rose New Look Goes Viral Details, Actress Honey R-TeluguStop.com

అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా లో హనీ కీలక పాత్రలో కనిపించబోతుందనే వార్తలు వస్తున్నాయి.ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

మొన్నటి వరకు కాస్త లావుగా బొద్దుగా ఉన్న హనీ ఇప్పుడు సన్నగా మారింది.తెలుగు సినిమాల్లో ఆఫర్స్ కోసం ఈమె సన్నగా మారిందనే టాక్ వినిపిస్తోంది.

వీర సింహా రెడ్డి సినిమా లో బాలకృష్ణ కు తల్లి పాత్రలో కూడా కనిపించాలని కాస్త ఎక్కువ వెయిట్ మెయింటైన్ చేసిన ఈమె ముందు ముందు తెలుగు లో యంగ్ స్టార్ హీరోలకు జోడి గా నటించడం కోసం సన్నబడ్డట్టు తెలుస్తోంది.ఈ మధ్య కాలం లో సోషల్ మీడియా ద్వారా ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా తాజాగా ఈమె షేర్ చేసిన చీర కట్టు ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.చీర కట్టులో హనీ చాలా క్యూట్ గా అందంగా సన్నగా నాజూకుగా కనిపిస్తోందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే తరహాలో ఫిజిక్ మెయింటైన్ చేస్తే కచ్చితంగా తెలుగు సినిమాల్లో బిజీ హీరోయిన్ గా ఈ అమ్మడు గుర్తింపు దక్కించుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు లో ఇప్పటికే చాలా మంది కేరళ ముద్దుగుమ్మలు ఉన్నారు.స్టార్ హీరోయిన్స్ గా కూడా కేరళ బ్యూటీలు టాలీవుడ్ లో నిలిచారు.

కనుక ఈమె కూడా ప్రయత్నిస్తే తప్పకుండా తెలుగు లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube