జనసేన పార్టీలో ఇప్పుడిప్పుడే ఒకరకమైన ఊపు కనిపిస్తోంది.ప్రజా పోరాట యాత్ర పేరుతో జనసేనాని ప్రజల్లో తిరుగుతూ.
సభలు సమావేశాలు పెడుతూ… మైలేజ్ పెంచుతున్నాడు.ఈ ప్రభావంతో ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో ఒక రకమైన పాపులారిటీ ఆ పార్టీకి వస్తున్నట్టు కనిపిస్తోంది.
ఇక పవన్ చాలా కాలంగా మూడు నాలుగు జిల్లాల మీదే ఫోకస్ పెట్టాడు.ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పార్టీకి ఆశాజనకంగా సీట్లు వస్తాయని బలంగా నమ్ముతున్నాడు.
అయితే … ఇదే సమయంలో ఆ పార్టీకి ఒక పెద్ద చిక్కొచ్చిపడింది.

పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారు అంటూ… అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ మీద ఎలా అయితే అపవాదు వచ్చిందో అదే పంథాలో ఇప్పడు జనసేన మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి.అయితే ఈ వ్యవహారంలో పవన్ కానీ ఆయన కోటరీకి కానీ సంబంధం లేకుండా కొంతమంది దళారులు టికెట్లు ఇప్పిస్తామనని అందినకాడికి ఆశావాహుల నుంచి డబ్బులు వసూల్ చేస్తున్నారట.అయితే ఈ వ్యవహారం పవన్ వరకూ వెళ్లడంతో.
ఎవరైనా టికెట్లను ఇప్పిస్తామని అంటే వారిని నమ్మవద్దు.అని బహిరంగంగా పవన్ ప్రకటించాల్సి వచ్చింది.
పవన్ కళ్యాణ్ పార్టీలో ఇప్పటి వరకూ చేరింది కొంతమందే.వాళ్లే అంతర్గత పోరు మొదలుపెట్టారని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.అవి పతాక స్థాయికి చేరినట్టుగా కూడా తెలుస్తోంది.ఇలాంటి నేపథ్యంలో పార్టీ టికెట్ల విషయంలో పవన్ చేసిన ప్రకటన కొంత ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇప్పటికే చేరిన వారు టికెట్లను ఇప్పిస్తామంటూ ఏదైనా దందా మొదలుపెట్టి ఉండవచ్చని.అందుకే పవన్ కల్యాణ్ ఇలా ప్రకటన చేసాడనే అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.







