మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.
బాక్సింగ్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.ఇక కంప్లీట్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ మూవీగా దీనిని దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఆవిష్కరిస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ ఈ మూవీలో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది.ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ 70 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
ఇప్పటి వరకు వచ్చిన అవుట్ పుట్ కూడా చాలా అద్బుతంగా వచ్చినట్లు తెలుస్తుంది.
ఇక నెక్స్ట్ షెడ్యూల్ లో యాక్షన్, క్లైమాక్స్ సన్నివేశాలు షూటింగ్ చేయాల్సి ఉంది.
కరోనా లాక్ డౌన్ నుంచి ఉపశమనం లభించి షూటింగ్ లకి పర్మిషన్ లభించగానే సెట్స్ పైకి వెళ్ళడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.ఇక ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ని కంప్లీట్ గా హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ ఆధ్వర్యంలో చిత్రీకరించనున్నారు.
ఈ విషయాన్ని చిత్ర నిర్మాత సిద్దు తెలియ జేశారు.ఈ యాక్షన్ ఎపిసోడ్ కంప్లీట్ గా హాలీవుడ్ స్టైల్‌లో ఉంటుందని దీనిని బట్టి తెలుస్తుంది.ఇక ఈ యాక్షన్ సీన్స్ కోసం వరుణ్ తేజ్ ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టినట్లు ఒక పోస్టర్ తో నిర్మాత రివీల్ చేశారు.ఇదిలా ఉంటే ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ అయ్యాక అనిల్ రావిపూడి ఎఫ్3 మూవీలో వరుణ్ తేజ్ జాయిన్ అయ్యే అవకాశం ఉంది.