మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Mega Hero Varun Tej ) ముందు నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.డీసెంట్ హిట్స్ కూడా అందుకున్నాడు.
కథల ఎంపికలో తనదైన పంథాను కొనసాగిస్తున్న వరుణ్ ఇప్పుడు ”గాండీవధారి అర్జున”( Gandeevadhari Arjuna ) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

గని సినిమా( Ghani Movie )తో ప్లాప్ అందుకున్న వరుణ్ ఈ సినిమాతో అయినా హిట్ అందుకోవాలని ఆశ పడ్డాడు.అయితే ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని మూట గట్టుకుంది.మొదటి షో నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వీకెండ్ లో సైతం దారుణమైన కలెక్షన్స్ ను పొందింది.45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.
20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా దారుణమైన వసూళ్లను రాబట్టింది.మొదటి రోజు కేవలం 75 లక్షల షేర్ వసూళ్లు మాత్రమే రాబట్టిన ఈ మూవీ రెండవ రోజు 45 లక్షల గ్రాస్, 23 లక్షల షేర్ రాబట్టింది.ఇక మూడవరోజు ఆదివారం 26 లక్షల షేర్ మాత్రమే రాబట్టిందట.
ఈ వసూళ్లు చూస్తుంటే దారుణమైన నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది అనిపిస్తుంది.

దీంతో ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్ లోనే అట్టర్ ప్లాప్ సినిమాగా రికార్డ్ నమోదు చేసింది.ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య( Sakshi Vaidya ) హీరోయిన్ గా నటించగా.మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.
అలాగే ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మించగా.మరి ఈ సినిమా రేపో మాపో ప్యాకప్ చెప్పేలానే కనిపిస్తుంది.
చూడాలి క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతతో ముగుస్తాయో.







