Varun Tej : మెగా ఫ్యామిలీని క్రికెట్ టీం తో పోల్చిన వరుణ్ తేజ్.. వీడియో వైరల్?

టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్( Varun Tej ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మెగా హీరో కొణిదెల నాగబాబు( Hero Konidela Nagababu ) తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నాడు.

 Varun Tej Comments About Mega Family At One Day World Cup-TeluguStop.com

ఇది ఇలా ఉంటే హీరో వరుణ్ తేజ్ త్వరలోనే హీరోయిన్ లావణ్య త్రిపాఠినీ( Lavanya Tripathi ) పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే.ఆ సంగతి పక్కన పెడితే తాజాగా మెగా ఫ్యామిలీ గురించి హీరో వరుణ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Telugu Tollywood, Varun Tej, Cup-Movie

ఇంతకీ వరుణ్ తేజ్ ఏం కామెంట్ చేసారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.వరుణ్ తేజ్ తాజాగా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కి కామెంటరీ చేస్తూ కొత్త అవతారం ఎత్తాడు.నేడు అక్టోబర్ 22న ధ‌ర్మ‌శాల వేదిక‌గా న్యూజిలాండ్ జ‌ట్టుతో భార‌త్ త‌ల‌ప‌డుతోంది.ఇక ఈ మ్యాచ్ తెలుగు కామెంట్రీలో వరుణ్ తేజ్ కూడా పాల్గొన్నాడు.అక్కడ ఇతర కామెంటేటర్స్ తో కలిసి క్రికెట్ అభిమానులను వరుణ్ తేజ్ అలరించాడు.ఈ క్రమంలోనే వరుణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.అందరు మమల్ని అనగా మెగా హీరోలు క్రికెట్ టీం అని అంటుంటారు.

ఒక మ్యాచ్ ఏమైనా ప్లాన్ చేయండి.

Telugu Tollywood, Varun Tej, Cup-Movie

నేను బన్నీ అన్న, చరణ్ అన్న, తేజ్, శిరీష్( Bunny Anna, Charan Anna, Tej, Shirish ) అందరం కలిసి వచ్చి ఆడతాం అని తెలిపాడు.దాంతో ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.వీటిపై ఆడియన్స్ సరదా కామెంట్స్ తో రియాక్ట్ అవుతూ వస్తున్నారు.

కాగా వరుణ్ తన కొత్త సినిమా ఆపరేషన్ వాలెంటైన్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు.వరుణ్ 13వ సినిమాగా వస్తున్న ఈ మూవీని కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు.

ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణకు గుమ్మడికాయ కొట్టేశాడు వరుణ్.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ డిసెంబర్ 8న తెలుగు, హిందీ లాంగ్వేజ్స్ లో రిలీజ్ కానుంది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ మానుషి చిల్లర్ హీరోయిన్గా నటించింది.కాగా మెగా హీరోలను క్రికెట్ టీం తో పోలుస్తూ వరుణ్ తేజ్ చేసిన వ్యాఖ్యలపై కొందరు మెగా అభిమానులు మండిపడుతున్నారు.

మరికొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube