మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) పెళ్లి వేడుకలు ఇటలీలో ఎంతో అట్టహాసంగా జరుగుతున్నాయి.మూడు రోజుల నుంచి వీరి పెళ్లి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.
అక్టోబర్ 30 వ తేదీ వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.అక్టోబర్ 30వ తేదీ సంగీత్ నిర్వహించగా 31వ తేదీ ఉదయం హల్దీ సాయంత్రం మెహందీ వేడుకలను( Mehendi Event ) ఎంతో ఘనంగా నిర్వహించారు.
తాజాగా మెహందీ వేడుకలకు సంబంధించినటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వరుణ్ తేజ్ లావణ్య( Lavanya ) వివాహం ఇటలీలో జరగబోతున్నటువంటి నేపథ్యంలో వీరి కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పెళ్లి వేడుకలలో పాల్గొన్నారు.మెగా కుటుంబ సభ్యులతో పాటు అల్లు కుటుంబ సభ్యులు కామినేని కుటుంబ సభ్యులకు కూడా ఈ పెళ్లి వేడుకలలో భాగమయ్యారు.మరోవైపు లావణ్య త్రిపాఠి బంధువులు కూడా ఈ పెళ్లి వేడుకలలో సందడి చేశారు.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఏ హీరో కూడా ఈ పెళ్లికి హాజరు కాకపోయినా నితిన్ ( Nithin ) తన భార్య శాలిని ( Shalini ) మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా ఈ పెళ్లి వేడుకలలో సందడి చేశారు.
ఇక గత రాత్రి మెహందీ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించడంతో అమ్మాయిలందరూ కూడా చేతుల నిండా గోరింటాకు పెట్టుకొని పెద్ద ఇతన సందడి చేయగా హీరోలందరూ కూడా మ్యూజిక్ ఈవెంట్లో పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేశారు.ఇక లావణ్య త్రిపాఠి ఈ మెహందీ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించారు.ప్రత్యేకంగా డిజైన్ చేయించిన గాగ్రాలో ఎంతో అందంగా కనిపించడమే కాకుండా రెండు చేతుల నిండా మెహందీ వేయించుకొని లావణ్య త్రిపాఠి ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
ఇలా వీరి మెహందికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక నేను మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నారు.
ఇలా పెళ్లి బంధంతో వీరిద్దరూ ఒకటి కాబోతున్నారు.