మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( varun tej ) మరియు లావణ్య త్రిపాఠి( lavanya tripathi ) పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.నేడు వీరిద్దరు కూడా నిశ్చితార్థం తో ఒక్కటి అవ్వబోతున్న నేపథ్యం లో మెగా ఫ్యాన్స్ లో సందడి వాతావరణం నెలకొంది.
మెగా ఫ్యామిలీ కి చెందిన వరుణ్ తేజ్ తో పెళ్లి కి సిద్దం అయిన లావణ్య త్రిపాఠి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎలాంటి ప్రకటనలు చేయలేదు.అలాగే మెగా ఫ్యామిలీ కూడా ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా నిశ్చితార్థం గురించి చిన్న ప్రకటన ఇచ్చి వదిలేశారు.
దాంతో అసలు మెగా ఫ్యామిలీ లో ఈ పెళ్లి అంటే ఆసక్తి ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.నేడు జరుగనున్న వివాహ నిశ్చితార్థం( varun tej and lavanya tripathi engagement ) కు సంబంధించిన గెస్ట్ ల విషయం అందరికి కూడా ఆశ్చర్యంగా ఉంది.
వరుణ్ తేజ్ ఫ్యామిలీ మరియు లావణ్య త్రిపాఠి ల ఫ్యామిలీల మధ్యే నిశ్చితార్థం జరుగబోతుంది.

రెండు ఫ్యామిలీలు మాత్రమే వివాహ నిశ్చితార్థం లో పాల్గొంటాయి అంటూ మెగా ఫ్యామిలీ కి చెందిన పీఆర్ టీమ్ ఆఫ్ ది రికార్డ్ పేర్కొన్నారు.నిశ్చితార్థం ను ఇంత సైలెంట్ గా చేయడానికి కారణం ఏంటి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.పెళ్లి అయినా మెగా ఫ్యామిలీ రేంజ్ లో చేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాడు.
నేడు వివాహ నిశ్చితార్థం కి పవన్ కళ్యాన్ హాజరు అవ్వబోతున్నాడా లేదా అనే అనుమానాలు అన్ని వర్గాల వారికి పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది.ఆ మధ్య నాగబాబు కూతురు నిహారిక పెళ్లి ని ఏ రేంజ్ లో చేశారో అందరం చూశాం.
రాజస్థాన్ లో ఆహా ఓహో అన్నట్లుగా చేయడం జరిగింది.కానీ ఇప్పుడు పరిస్థితి అలా కనిపించడం లేదు.వరుణ్ తేజ్ పెళ్లి వేడుక ఎంత వరకు వైభవంగా జరుగుతుంది అనేది తెలియడం లేదు.లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోవడం వరుణ్ తరపు వారికి ఇష్టం లేదా అంటూ కొందరు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నారు.







