మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) తాను ప్రేమించిన అమ్మాయి అయిన లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేశాడు.అందుకోసం మెగా ఫ్యామిలీ మొత్తంను మరియు తన స్నేహితులను సన్నిహితులను ఇటలీ వరకు తీసుకు వెళ్లాడు.
మూడు రోజులుగా ఇటలీ లో ఈ మెగా వేడుక జరుగుతోంది.రాజకీయాలతో ఎంతో బిజీగా ఉంటూ, ఎప్పుడూ కూడా జనాల్లో ఉండే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మూడు రోజులుగా వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఇటలీ లో ఉన్నాడు.
నేడు లేదా రేపు మెగా ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఆ విషయం పక్కన పెడితే ఎందుకు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం ఇటలీ( Italy ) లో జరిగింది అంటూ కొందరు మెగా ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.సాధారణంగా వైభవంగా పెళ్లి చేసుకోవాలి అనుకునే వారు రాజస్థాన్ లోని ప్యాలేస్ ల్లో చేసుకుంటూ ఉన్నారు.కానీ వరుణ్ తేజ్ మాత్రం అక్కడకు వెళ్లి మరీ పెళ్లి చేసుకున్నాడు.
మొదటి సారి ఇటలీ లో లావణ్య త్రిపాఠికి వరుణ్ తేజ్ తన ప్రేమ విషయాన్ని తెలియజేశాడట.

అంతే కాకుండా తమ మధ్య ప్రేమ మొదలు అవ్వడంకు కారణం కూడా ఇటీల అంటూ వరుణ్ సన్నిహితుల వద్ద అన్నాడట.అందుకే తమ పెళ్లికి సరైన వేదిక, ప్లేస్ ఇటలీ గా వరుణ్ భావించాడు.అందుకే ఆయన కుటుంబ సభ్యులు అంతా కూడా ఒప్పుకుని అక్కడ పెళ్లికి విమానం ఎక్కరు.
మూడు రోజుల డెస్టినేషన్ వెడ్డింగ్ ను చేసుకున్న వరుణ్, లావణ్య లు వచ్చే వారం లో హైదరాబాద్ లో సన్నిహితులు మరియు ఫ్యాన్స్ కోసం భారీ రిసెప్షన్ ను ఏర్పాటు చేయబోతున్నారట.ఆ రిసెప్షన్ లో మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు తెలుగు సినిమా పరిశ్రమ కు చెందిన ఇతర హీరో లు హీరోయిన్స్ కూడా హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి.







