టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించిన హీరొలలో వరుణ్ సందేశ్ ( Varun sandesh )ఒకరు.జయాపజయాల సంగతి పక్కన పెడితే వరుణ్ సందేశ్ కు నటుడిగా మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.
వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు తక్కువ సినిమాలే చేసినా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.పలు టీవీ షోలకు వితికా షేరు యాంకర్ గా కూడా వ్యవహరించి పాపులారిటీని సంపాదించుకున్నారు.

బిగ్ బాస్ షో ద్వారా వరుణ్ సందేశ్ వితికా షేరు జోడీ ఫేమస్ అయ్యారు.అయితే ఈ షో వల్ల తనపై ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో నెగిటివిటీ పెరిగిందని తర్వాత రోజుల్లో వితిక( Vithika sheru ) ఫీల్ కావడం జరిగింది.బిగ్ బాస్ షో వితికకు మైనస్ అయిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమైన సంగతి తెలిసిందే.ఒక ఇంటర్వ్యూలో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ వితిక సంపాదన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా మనిషి మారకూడదని వరుణ్ చెప్పుకొచ్చారు.బయటి ప్రపంచంలో సైతం సక్సెస్ ఫెయిల్యూర్స్ సాధారణం అని వరుణ్ సందేశ్ పేర్కొన్నారు.వరుసగా ఫ్లాపులు రావడంతో నేను సినిమాలకు బ్రేక్ తీసుకున్నానని ఆయన తెలిపారు.దేవుని స్క్రిప్ట్ ను ఎవరూ మార్చలేరని వరుణ్ పేర్కొన్నారు.బిగ్ బాస్ షో ( Bigg Boss Show )తర్వాత వితిక గురించి నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు.ఒక రియాలిటీ షోను చూసి మనిషిని జడ్జ్ చేయడం కరెక్టా? అని వరుణ్ సందేశ్ వెల్లడించారు.వితిక యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ అయిందని ఆమె విషయంలో గర్వపడుతున్నానని వరుణ్ సందేశ్ అన్నారు.వితికకు యూట్యూబ్ ఛానల్ ద్వారా లక్షల్లో ఆదాయం వస్తోందని వరుణ్ సందేశ్ చెప్పకనే చెప్పేశారు.







