చనిపోయిన డ్రైవర్ కు హీరో భావోద్వేగపు నివాళి.. ఎమోషనల్ అయినా అభిమానులు?

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఇటీవలే హీరో వరుణ్ ధావన్ డ్రైవర్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా తన డ్రైవర్ కు బావోద్వేగపు నివాళి అర్పించారు.తన డ్రైవర్ కు వరుణ్ ధావన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ ని చూసి వరుణ్ అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు.

ఆ విషయం పై అభిమానులు వరుణ్ ధావన్ పై కామెంట్స్ వర్షం కూడా కురిపించారు.ఇకపోతే వరుణ్ ధావన్ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ ఇటీవలే మంగళవారం రోజు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

బాంద్రాలోని మెహబూబ్ స్టూడియోలో సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో వరుణ్ ధావన్ డ్రైవర్ మనోజ్ సాహూ గుండెపోటుకు గురయ్యి ఒక్కసారిగా కుప్పకూలాడు.వెంటనే వరుణ్ అతన్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ పెద్దగా ఫలితం లేకుండా పోయింది.

Advertisement
Varun Dhawan Emotional Tribute To His Driver Manoj Sahoo Details, Varun Dhawan,

వరుణ్ ధావన్ తో పాటు 26 ఏళ్లు కలిసి ఉన్న మనోజ్ సాహు ఒక్కసారిగా గుండెపోటుతో మరణించడం తో వరుణ్ ధావన్ శోకసంద్రంలో మునిగిపోయారు.ఈ నేపథ్యంలోనే తన డ్రైవర్ ని గుర్తు చేసుకుంటూ తాజాగా సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

డ్రైవర్ కి నివాళిగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్టు పెట్టారు.

Varun Dhawan Emotional Tribute To His Driver Manoj Sahoo Details, Varun Dhawan,

బీచ్ లో లవ్ షేప్ లో మనోజ్ బాయ్ మిస్ యు సో మచ్ అని రాశారు.అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ పోస్ట్ చూసిన అభిమానులు భావోద్వేగానికి లోనవుతూ అతనిపై కామెంట్ల వర్షం కురిపించారు.

మనోజ్ బాయ్ స్వర్గం నుంచి ఇది చూసి చిరునవ్వు చిందిస్తూ అంటూ అభిమాని కామెంట్ చేశాడు.ఈ పోస్టు తో మీరు నా హృదయాన్ని గెలుచుకున్నారు.మీకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలి అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

ఈ ఫోటో పై ఇంకొందరు అభిమానులు భావోద్వేగంతో స్పందించారు.

Advertisement

తాజా వార్తలు