డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఎఫ్ 3 మూవీ తో బిగ్ సక్సెస్ అందుకున్న దిల్ రాజు , ఆ తరువాత నాగ చైతన్య తో నిర్మించిన థ్యాంక్యూ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంత స్థాయి లో విజయం అందుకోలేక పోయింది .ప్రస్తుతం దిల్ రాజు చేతిలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్ లో ఉన్నాయి .
ఈ నేపథ్యంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ తో భారీ బడ్జెట్ తో నిర్మించిన వారసుడు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది .సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ్ స్టార్ విజయ్ దళపతి నటించిన ఈ సినిమా జనవరి 14న విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది .మొదట్లో ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది, ఇక ఆ తర్వాత నెమ్మదిగా ఊపు అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది .ఇక వారసుడు సినిమాను డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఎక్కడ కామ్రమైజ్ కాకుండా తెరకెక్కించారు .ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్స్ , టీజర్స్ , సాంగ్స్ , ఫైట్స్ , హీరో విజయ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరింది.రెండు భాషల్లో ఒకే సారి విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది.

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో వారసుడు మూవీ స్పెషల్ అట్రాక్షన్ గా మిగిలింది , తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి.కన్నడ బ్యూటీ రష్మిక ముందన్నా జంటగా నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.సంక్రాంతి పండుగ కు ముందుగా ప్రకటించినట్లుగానే జనవరి 11న తమిళంలో విడుదల కాగా.
జనవరి 14న తెలుగులో గ్రాండ్ రిలీజ్ అయ్యింది.ఇక అటు తమిళంలోనూ మంచి కలెక్షన్స్ వచ్చాయి.ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది .ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లుగా టాక్ వినిపిస్తుంది .ఇక లేటేస్ట్ అప్డేట్ సమాచారాం ప్రకారం .ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ధ సంస్థ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.అలాగే ఈ మూవీని థియేట్రికల్ రన్ అనంతరం నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది .ఇక దీనికి సంబంధించి తర్వలోనే స్ట్రీమింగ్ డేట్ అఫీషియల్ గా మూవీ యూనిట్ ప్రకటిస్తుంది .







