నాన్న నాకు అడ్రస్ లేకుండా చేస్తానన్నాడు.. అందుకే విడాకులు.. వనిత షాకింగ్ కామెంట్స్!

కోలీవుడ్ నటి వనితా విజయ్ కుమార్ పై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే.

నెటిజన్లలో ఎక్కువమంది సోషల్ మీడియాలో ఆమె గురించి నెగిటివ్ గా కామెంట్లు చేస్తారు.

మంజుల, విజయ్ కుమార్ ల కూతురైన వనితా విజయ్ కుమార్ పెళ్లిళ్ల వల్ల, విడాకుల వల్ల వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచారు.తమిళ బిగ్ బాస్ షో ద్వారా వనితా విజయ్ కుమార్ మరింత పాపులారిటీని సంపాదించుకున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వనితా విజయ్ కుమార్ జీవితంలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.పిల్లల కొరకు అమ్మ మంజుల ఎంతో శ్రమించి డబ్బులు సంపాదించారని ఎంతో కష్టపడి ఆమె స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారని వనిత అన్నారు.

అమ్మానాన్నలకు ముగ్గురు ఆడపిల్లలం కావడంతో అమ్మ ఆస్తి ముగ్గురికి సమానంగా రావాలని అయితే నాన్న వల్ల తాను ఆస్తిలో చిల్లిగవ్వ కూడా పొందలేకపోయానని ఆమె చెప్పుకొచ్చారు.నాన్న తన విషయంలో క్రూరంగా ప్రవర్తించాడని వనిత తెలిపారు.

Advertisement

నాన్న తనను ఇంటినుంచి బయటకు గెంటేశాడని ఆమె చెప్పుకొచ్చారు.తనకు అడ్రస్ లేకుండా చేస్తానని నాన్న అన్నారని వనిత కామెంట్లు చేశారు.నాపై నాన్నకు కోపం ఎందుకనే విషయం నాకు తెలియదని ఫ్యామిలీ మెంబర్స్ అంతా తాను చనిపోయానని చెబుతారని వనితా విజయ్ కుమార్ కామెంట్లు చేశారు.

ఆస్తి కొరకు తాను సుప్రీం కోర్టుకు కూడా వెళ్లానని ప్రేక్షకుల ఆదరాభిమానాల వల్ల తాను ఈ స్థాయికి వచ్చానని వనితా విజయ్ కుమార్ చెప్పుకొచ్చారు.చిన్న వయస్సులో పెళ్లి చేసుకోవడం వల్ల తనకు పెళ్లి విలువ తెలియలేదని తను చేసుకున్న పెళ్లిళ్లు నిలవలేదని ఆమె చెప్పుకొచ్చారు.వనితా విజయ్ కుమార్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
" autoplay>

తాజా వార్తలు